యాక్షన్‌ హెబ్బులి.. ఆగస్టు 4న తెలుగులో రిలీజ్‌

22 Jul, 2023 00:52 IST|Sakshi

సుదీప్, అమలా పాల్‌ జంటగా ఎస్‌. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన కన్నడ రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హెబ్బులి’. ఈ సినిమాను అదే టైటిల్‌తో సి. సుబ్రహ్మణ్యం ఆగస్టు 4న తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాంటిక్‌ సీన్స్‌ మిళితమై ఉన్న పక్కా కమర్షియల్‌ ఫిల్మ్‌ ‘హెబ్బులి’. కన్నడంలో రూ. 100 కోట్లు సాధించింది. తెలుగులోనూ హిట్‌ అవు తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.   

మరిన్ని వార్తలు