ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

27 Jan, 2021 19:07 IST|Sakshi

మలయాళ దర్శకుడు, నటుడు మధుపాల్‌ పెద్ద కూతురు, టీవీ యాంకర్‌ మాధవి పెళ్లి ఘనంగా జరిగింది. కేరళలోని వాజుత్తకోడ్‌కు చెందిన అరవింద్‌తో ఆమె ఏడడుగులు వేసింది. శాంతిగిరి ఆశ్రంలో ఈ వివాహ కార్యక్రమం జరగ్గా ఈ విషయాన్ని పెళ్లి కూతురి చెల్లి మీనాక్షి సోమవారం సోషల్‌ మీడియాలో వెల్లడించింది. "ప్రపంచంలోనే నువ్వు బెస్ట్‌ అక్కవి. నువ్వు పెళ్లి బంధంలో అడుగు పెట్టినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు వేరే ఇంట్లోకి అడుగు పెడుతున్నా మేమంతా నీ వెన్నంటే ఉంటాం. కానీ నిన్ను ఎంత మిస్‌ అవుతానో చెప్పడం నాకిష్టం లేదు. ఎందుకంటే అది తలుచుకుంటేనే కన్నీళ్లు జలధారలా కారడం ఖాయం. బెస్ట్‌ ఫ్రెండ్‌, బెస్ట్‌ సిస్టర్, బెస్ట్‌ డాటర్‌‌.. ఇలా అన్నీ ఉన్న నువ్వు  దొరకడం నా అదృష్టం. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను" అని ఎమోషనల్‌ అవుతూ వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. (చదవండి: నటిని పెళ్లాడబోతున్న దర్శకుడు)

మరోవైపు సన్నిహితులు, స్నేహితుల కోసం రిసెప్షన్‌ ఏర్పాటు చేయగా టీవీ సెలబ్రిటీలతో పాటు సినిమా వాళ్లు కూడా హాజరై వధూవరును మనసారా ఆశీర్వదించారు. వీరిలో నటులు జగదీష్‌, మనియన్‌ పిల్ల రాజు, శ్రీకుమార్‌, దర్శకులు కమల్‌, షాజి కైలాస్ తదితరులు ఉన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా అభిమానులు కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సినీ దర్శకుడు మధుపాల్‌ - రేఖల మొదటి సంతానమే మాధవి. టీవీ యాంకర్‌గా ఆకట్టుకున్న ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గానూ పని చేస్తున్నారు. (చదవండి: వైరల్‌: బుల్లితెర స్టార్లతో ప్రదీప్‌ డ్యాన్స్‌)

A post shared by Meenakshi 💮 (@meenakshi_madhupal)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు