అన్ని భాషల్లోనూ అదరగొట్టింది..ఈ చిన్నారి ఎవరో తెలుసా?

8 Mar, 2023 16:46 IST|Sakshi

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో ఎంట్రీ ఇ‍చ్చి.. పలు మలయాళం సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్‌లో అలా మొదలైంది చిత్రంలో ఆరంగ్రేటం చేసింది ఆ ఫోటోలోని చిన్నారి. ఇంతకీ ఆమె ఎవరో మీకు గుర్తొచ్చిందా? టాలీవుడ్‌ అగ్ర హీరోలతో పలు సినిమాల్లో నటించి మెప్పించింది.  విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తెలుగులో చివరిసారిగా పవన్ కల్యాణ్‌ చిత్రంలో కనిపించింది ఆ చిన్నారి. ఆ ఫోటోలో ముసిముసి నవ్వులు చిందిస్తున్న చిన్నారి దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా నటించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవేయండి. 

హీరోయిన్‌ నిత్యామీనన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దక్షిణ భారత సినీరంగంలో అత్యధిక రేటింగ్ పొందిన హీరోయిన్లో ఒకరు. కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన నిత్యా విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఏ పాత్ర పోషించినా అందులో సహజత్వం ఉట్టి పడుతుంది. అలాగే ఏది పడితే ఆ పాత్ర ఒప్పుకోదు. అదే ఆమెలో ప్లస్, మైనస్‌ కూడా. నటనకు అవకాశం ఉన్న పాత్రలే అంగీకరించి పేరు తెచ్చుకుంటోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 'ఒకే బంగారం' సినిమాలో కూడా నటించింది భామ. ఇటీవల ఆమె 'వండర్ ఉమెన్ అనే వెబ్‌ సిరీస్‌లో కనిపించింది. ఆమె నటించిన సోలో నటి చిత్రం 'ప్రాణ', బాలీవుడ్‌లో 'మిషన్ మంగళ్'లో విజయాన్ని సాధించాయి. ఆమె నటనకు పలు అవార్డులు కూడా సాధించింది.

2022లో తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన 'తిరుచిత్రంబళం'లో నిత్యా మీనన్ ప్రధాన పాత్ర పోషించింది, ఇందులో ధనుష్ నటించిన హీరోకి ప్రేమికురాలిగా మారిన చిన్ననాటి స్నేహితురాలి పాత్రలో ఆమె హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. తాజాగా ఆమె చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. నిత్యామీనన్ ప్రస్తుతం 'ఆరం తిరుకల్పన'లో నటిస్తోంది. త్వరలోనే పేరు పెట్టని అంజలీ మీనన్ చిత్రం షూటింగ్‌లో పాల్గొననుంది.  

మరిన్ని వార్తలు