ఆ వీడియోలో ఉన్నది నేను కాదంటూ ఏడ్చిన నటి

3 Jun, 2021 18:57 IST|Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసిన మలయాళ నటి

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తన పేరుతో వైరలవుతోన్న పోర్న్‌ వీడియోలో ఉన్నది తాను కాదన్నారు మలయాళ నటి రమ్యా సురేష్‌. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ వేదికగా తన ఆవేదనను వెల్లడిస్తూ.. కన్నీరు పెట్టారు రమ్యా సురేష్‌. ‘‘ఇంటర్నెట్‌లో వైరలవుతన్న పోర్న్‌ వీడియోలో ఉంది నేను కాదు. అసలు ఈ వీడియో గురించి నాకు తెలియదు. ఓ స్నేహితురాలు చెప్పడంతో ఆ వీడియోను నేను చూశాను. అది చూసి కుప్పకూలిపోయాను. ఎందుకంటే వీడియోలో ఉన్న యువతికి, నాకు చాలా పోలికలున్నాయి. సడెన్‌గా చూసినవారేవరైనా ఆ వీడియోలో ఉంది నేనే అనుకుంటారు. నా గురించి బాగా తెలిసిన వారు మాత్రమే అందులో ఉన్నది నేను కాదని గుర్తించగలరు.. మిగతావారు అది నేనే అని నమ్మే అవకాశం ఉంది’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

ఈ వీడియో గురించి అప్పుజలోని పోలీస్‌ స్టేషన్‌లో, సైబర్‌ సెల్‌కు ఫిర్యాదు చేసినట్లు రమ్యా సురేశ్‌ తెలిపారు. ‘‘వీడియోలో ఉన్నది నేను కాదని నాకు తెలిసు. నా భర్త కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు. అది చాలు. అందుకే ఇంత ధైర్యంగా ఉన్నాను. పోలీసులు కూడా నాకు చాలా మద్దతుగా ఉన్నారు. ఈ వీడియోని షేర్‌ చేసిన వారిని గుర్తించామన్నారు పోలీసులు’’ అని తెలిపారు రమ్యా సురేష్‌.

‘‘పోలీసులకు ఫిర్యాదు వచ్చి ఇంటికి వచ్చే సరికి నా ఫేస్‌బుక్‌ పేజ్‌కి చాలా మెసేజ్‌లు వచ్చాయి. నా స్నేహితులు కాల్‌ చేస్తున్నారు. మాట్లాడలంటే చాలా భయం వేస్తుంది. ఏం అంటారో అనిపిస్తుంది. నేను ఎక్కడా రాజీపడలేదు కాబట్టే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొవాల్సి వచ్చిందని నాకు తెలుసు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒక్కటే.. వీడియోలో ఉన్నది నేను కాదు. నా మాట నమ్మండి.. నా గురించి తప్పుగా అనుకోకండి’’ అని కోరారు రమ్యా సురేష్‌. 

కుటుంబ సభ్యుల మద్దతు తనకు పూర్తిగా ఉందని త్వరలోనే ఈ సమస్య నుంచి బయటపడతానని రమ్యా సురేష్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె చివరిసారిగా నయనతార, కుంచాకో బోబన్ నిజాల్ చిత్రంలో కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

చదవండి: ఫోన్‌లో మెసేజ్‌లను తొలగించిన నటి

మరిన్ని వార్తలు