నటిగా మళ్లీ బిజీ అవ్వాలని చూస్తున్న సంజన..

29 Jun, 2021 18:39 IST|Sakshi

'బుజ్జిగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన గల్రానీ. కన్నడలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంజనకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు కలిసిరాలేదు. ఇక కన్నడలో బిజీ అవుతున్న టైంలో సంజన డ్రగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించిన సంగతి తెలిసిందే. గతేడాది శాండిల్‌వుడ్‌ ఇండస్ట్రీలో జరిగిన డ్రగ్స్‌ కేసులో సంజన అరెస్ట్‌ అయ్యే ఇటీవలె బెయిల్‌ మీద బయటకు వచ్చింది. అనంతరం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ..తన కంట్లో కన్నీళ్లు అయిపోయాయని, ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా అంటూ ఆదేవన వ్యక్తం చేసింది.

ఇక అదే సమయంలో ప్రియుడిని రహస్యంగా వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో నటిగా మళ్లీ బిజీ అవ్వాలని చూస్తుందట సంజన. ఇందులో భాగంగానే కథలు వింటుందని, తాజాగా వెంకట కృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఓ ప్రాజెక్టుకు సంజన సైన్‌ చేసినట్లు సమాచారం. ఫిమేల్‌ సెంట్రిక్‌ మూవీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు మణిశంకర్‌ అనే టైటిట్‌ను కూడా ఫిక్స్‌ చేశారట. అంతేకాకుండా తెలుగు, కన్నడ, హిందీ బాషల్లో ఈ మూవీ తెరకెక్కనుందని, వచ్చే నెలలోనే ఈ మూవీ సెట్స్‌ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. 

చదవండి : డాక్టర్‌తో రహస్య పెళ్లి : అందుకే అందరికి చెప్పలేదు.. సంజన
డ్రగ్స్‌ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు! 


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు