ఆ ఫొటో వల్లే సినిమా ఛాన్స్‌ వచ్చింది : వైశాలీ రాజ్‌

18 Aug, 2021 07:57 IST|Sakshi

‘‘క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘కనబడుట లేదు’. ఇప్పుడొస్తున్న సినిమాల్లో మాది బెస్ట్‌ అని చెప్పగలను. సునీల్‌గారితో నటించడం హ్యాపీ. మా చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని వైశాలీ రాజ్‌ అన్నారు. సునీల్, సుక్రాంత్‌ వీరెల్ల హీరోలుగా వైశాలీ రాజ్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘కనబడుట లేదు’. బాలరాజు ఎం దర్శకత్వం వహించారు. సాగర్‌ మంచనూరు, సతీశ్‌ రాజు, దిలీప్‌ కూరపాటి, డా. శ్రీనివాస్‌ కిషన్‌ అనపు, దేవీప్రసాద్‌ బలివాడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది.
(చదవండి: అ‍ఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోంది? అలనాటి హీరోయిన్‌ ఆందోళన)

ఈ సందర్భంగా వైశాలీ రాజ్‌ మాట్లాడుతూ– ‘‘నా అసలు పేరు కవిత. స్క్రీన్‌ నేమ్‌ వైశాలీ రాజ్‌. నాది వైజాగ్‌. రెండేళ్ల క్రితం మా నాన్నగారు చనిపోవడంతో ఉద్యోగం మానేసి, షార్ట్‌ ఫిలింస్‌లో నటించడం మొదలుపెట్టాను. రెండేళ్ల ముందు ఓ షార్ట్‌ ఫిల్మ్‌లో నా ఫొటో చూసిన బాలరాజుగారు ‘కనబడుట లేదు’లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. హీరోయిన్‌ పాత్రలే కాదు.. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాను. డైరెక్షన్‌ చేయాలని కూడా ఉంది.. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి’’ అన్నారు. 
(చదవండి: విశ్వక్‌ సేన్‌ అసలు పేరు ఏంటో తెలుసా?)

మరిన్ని వార్తలు