ఇంకా టైమ్‌ ఉంది!

4 Jul, 2021 00:41 IST|Sakshi

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ బ్రేక్‌ తర్వాత ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమా షూటింగ్‌ తిరిగి ఆరంభమైంది. ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మూడో షెడ్యూల్‌ శనివారం ముంబయ్‌లో ప్రారంభమైంది. అయితే హీరో ప్రభాస్‌ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణలో పాల్గొంటున్న ప్రభాస్, ఇక్కడ షెడ్యూల్‌ పూర్తయ్యాక ‘ఆదిపురుష్‌’ సినిమా సెట్‌లో జాయిన్‌ అవుతారు. అంటే... ‘ఆదిపురుష్‌’ సినిమా సెట్‌లోకి ప్రభాస్‌ ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా టైమ్‌ ఉంది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు.

‘సలార్‌’లో వాణీ కపూర్‌? ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. ఇందులో ఓ కీలక పాత్రకు వాణీ కపూర్‌ను సంప్రదించారని టాక్‌. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ ఆగస్టులో తిరిగి ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు