అందరూ వదిలేయడంతో అనాథలా.. నటి ఆత్మహత్య

10 Jul, 2021 08:44 IST|Sakshi

మంచి ఉద్యోగం-జీతం.. రెండింటినీ వదులుకుందామె. ఎవరూ ఊహించని రీతిలో పోర్న్‌ సినిమాల వైపు అడుగులేసింది. ఆ నిర్ణయంతో అయినవాళ్లకు దూరమైంది. చివరకు అనాథలా ఆత్మహత్యకు పాల్పడింది నటి క్రిస్టియానా లిసీనా. 

క్రిస్టియానా ‘క్రిస్‌ ది ఫాక్స్‌’ పేరుతో పాపులర్‌ అయిన రష్యన్‌ అడల్ట్‌ నటి. వయసు 29 ఏళ్లు. పోర్న్‌హబ్‌, ఓన్లీఫ్యాన్స్‌ సైట్ల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. ఆదివారం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌ 22 అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.     

చేతిలో కాయిన్‌
నేవ్‌స్కై పోలీసులు లిసీనా చేతిలో ఓ కాయిన్‌ను గుర్తించారు. దాని మీద ‘నువ్వెప్పుడు నా గుండెల్లో ఉంటావ్‌’ అనే కొటేషన్‌ ఉంది. అది తన బాయ్‌ఫ్రెండ్‌ను ఉద్దేశించి ఆమె రాసి ఉంటుందని భావిస్తున్నారు. చనిపోయే కాసేపటి ముందే ఆమె బిల్డింగ్‌లోకి ఎంటర్‌ అయిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్‌ అయ్యాయి.  గత కొంతకాలంగా లిసీనా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటోంది. దీంతో డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అభిమానులు నిర్ధారణకు వచ్చారు. కాగా, ఆమె మరణవార్త తెలియగానే ప్రియుడు రుస్తామ్‌.. సోషల్‌ మీడియా ద్వారా స్పందించాడు. ఒంటరితనం భరించలేకే ఆమె చనిపోయిందని వాపోయాడు. క్రిస్టియానా అంత్యక్రియల కోసం సాయం చేయాలని కోరడంతో.. కొందరు ముందుకొచ్చారు కూడా.

బ్యాంక్‌ జాబ్‌ వదిలి..
సైబీరియాకు చెందిన క్రిస్టియానా లిసీనా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. ఆపై క్రాస్కోయార్‌స్క్‌లో బ్యాంక్‌ ఉద్యోగం సంపాదించుకుంది. అయితే ఐదురోజులు మాత్రమే పని చేసిన ఆమె.. ఆసక్తి లేక అడల్ట్‌ సినిమాల వైపు మళ్లింది. దీంతో కుటుంబం ఆమెను వెలేయడంతో సెయింట్‌ పీటర్‌బర్గ్స్‌కు మకాం మార్చింది. తిరిగి కుటుంబంతో కలిసే ప్రయత్నం చేసినప్పటికీ.. కుదరలేదు. ఆమధ్య ఒంటరితనం తన పాలిట శాపమైందని ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయాన్ని.. ఇప్పుడు కొందరు గుర్తు చేస్తున్నారు. ఇక ఆమె చనిపోయాక ఓన్లీఫ్యాన్స్‌ పేజీలో ఆమె పేరుతో ఉన్న అకౌంట్‌ను తొలగించారు. మిగతా సైట్లలోనూ ఆమె వీడియోలను తొలగిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు