ఆ వార్తాకథణం ప్రేరణతో వైల్డ్‌ డాగ్‌ కథ రాశాను

25 Mar, 2021 07:45 IST|Sakshi

‘‘ఒక డైరెక్టర్‌ రైటర్‌ కావాల్సిన అవసరం లేదు. కానీ రైటింగ్‌ స్టైల్, యాక్టింగ్‌.. ఈ రెండింటిపై అవగాహన ఉండాలి’’ అన్నారు అహిషోర్‌ సాల్మన్‌. నాగార్జున హీరోగా అహిషోర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కానుంది.

ఈ సందర్భంగా అహిషోర్‌ మాట్లాడుతూ – ‘‘ఓ వార్తా కథనం ప్రేరణతో ‘వైల్డ్‌ డాగ్‌’ కథ రాశాను. 2007 నుంచి 2015 వరకు చాలా బాంబ్‌బ్లాస్ట్‌లు జరిగాయి. హైదరాబాద్‌లో గోకుల్‌ చాట్, లుంబినీ పార్క్‌ ప్రదేశాల్లో బ్లాస్ట్‌లు జరిగాయి. ఈ దాడులు ఎవరు చేస్తున్నారని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ఇన్విస్టిగేషన్‌ టీమ్‌తో అండర్‌కవర్‌ ఆపరేషన్‌ చేసిందని తెలిసింది. ముంబయ్, ఢిల్లీలో ఉన్న నా స్నేహితుల ద్వారా కొంత సమాచారం సేకరించాను. బుక్స్‌ చదివాను. వీటికి కొన్ని కల్పిత అంశాలు జోడించి, ఉత్కంఠభరితంగా ఉండేలా ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమాను తెరకెక్కించాం. విభిన్నమైన కథలను, కొత్త దర్శకులను నాగార్జునగారు ప్రోత్సహిస్తారు. ఆయన నటించిన ‘ఊపిరి’కి నేను కో– రైటర్‌గా చేశాను’’ అన్నారు. 

చదవండి: షాకింగ్‌ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు!

మరిన్ని వార్తలు