కథే హీరో

10 Nov, 2023 04:11 IST|Sakshi

దినేష్‌ తేజ్‌

దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్, పాయల్‌ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన లవ్‌స్టోరీ ఫిల్మ్‌ ‘అలా నిన్ను చేరి..’. మారేష్‌ శివన్‌ దర్శకత్వంలో కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో దినేష్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘జీవితంలోని ఓ దశలో ప్రేమ ముఖ్యమా? లక్ష్యం ముఖ్యమా? అంటూ ప్రతి మధ్యతరగతి అబ్బాయి గురయ్యే సంఘర్షణను ఇందులో చూపించాం.

ఈ సినిమాలో నేను కొత్తగా కాస్త కమర్షియల్‌ రోల్‌లో నటించాను. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్స్‌ నుంచి బయటకి వస్తారని చెప్పగలను. కథ ఉంటేనే ఏమైనా చేయగలం. అందుకే కథే హీరో అని నమ్మే వ్యక్తిని నేను. ప్రేక్షకులు మెచ్చుకునే కథల్లో భాగం కావాలనుకుంటాను’’ అన్నారు. 
 

మరిన్ని వార్తలు