అలీ రెజా నటించిన 'గ్రే' మూవీ ట్రైలర్‌ చూశారా?

15 May, 2022 08:18 IST|Sakshi

ప్రతాప్‌ పోతన్, అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీ రాయ్‌ ప్రధాన పాత్రల్లో రాజ్‌ మదిరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గ్రే’. ‘ద స్పై హూ లవ్డ్‌ మీ’ అనేది ట్యాగ్‌లైన్‌. కిరణ్‌ కాళ్లకూరి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరుగుతున్న ఎలైట్‌ ప్రో బాస్కెట్‌బాల్‌ టోర్నీలో రిలీజ్‌ చేశారు. ‘‘దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రూపొందిన చిత్రం ‘గ్రే’’ అన్నారు రాజ్‌ మదిరాజు.

‘‘నాకు యాక్టింగ్, బాస్కెట్‌బాల్‌ అంటే ఇష్టం. ఈ లీగ్‌లో నేను హైదరాబాద్‌ తరఫున పోటీ చేస్తున్నా. త్వరలో బాస్కెట్‌బాల్‌ నేపథ్యంలో ఓ సినిమా చేస్తా’’ అన్నారు అరవింద్‌ కృష్ణ. ‘‘మా సినిమా రష్‌ చూసినవారు మధుబాబు ‘షాడో’ నవలలా అద్భుతంగా ఉందని అభినందించారు’’ అన్నారు కిరణ్‌.    

మరిన్ని వార్తలు