‘ఇద్దరితో బ్రేకప్‌.. అతడిని ఎలా లవ్‌ చేస్తున్నావ్‌?’

19 Apr, 2021 20:31 IST|Sakshi

బాలీవుడ్‌ లవ్‌ కపుల్‌ ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని బీటౌన్‌లో గుసగుసలు వినిపించగా.. గతేడాది రణ్‌బీర్‌ కపూర్‌ తమ రిలేషన్‌ని కన్‌ఫామ్‌ చేశాడు. ఆలియా తన గర్ల్‌ఫ్రెండ్‌ అని.. కరోనా లేకుంటే ఈ ఏడాది తామిద్దరం వివాహం చేసుకునే వారమని తెలిపాడు. అయితే ఆలియా కంటే ముందే రణ్‌బీర్‌ మొదట దీపికా పదుకోనెతో, ఆ తర్వాత కత్రినా కైఫ్‌లతో ప్రేమాయణం నడిపాడు. వారిద్దరికి బ్రేకప్‌ చెప్పిన తర్వాత ఆలియాతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో గతంలో ఓ ఆంగ్ల మీడియా ఆలియాతో చేసిన ఇంటర్వ్యూలో రణబీర్‌ బ్రేకప్‌ స్టోరీల గురించి ఆమె దగ్గర ప్రస్తావించింది. ఇప్పటికే ఇద్దరితో విడిపోయాడు.. అతడిని మీరు ఎలా అంగీకరించారు అని ప్రశ్నించారు రిపోర్టరు. 

ఇందుకు ఆలియా సమాధానమిస్తూ.. ‘‘ఇదేం పెద్ద సమస్య కాదు. దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొందరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అదంతా గతం. దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ప్రస్తుతం నాతో ఎంత నమ్మకంగా, ప్రేమగా ఉన్నాడు అనేదే నాకు ముఖ్యం’’ అంటూ చెప్పుకొచ్చారు ఆలియా. 

అంతేకాక తమ బంధాన్ని స్నేహం అని పిలిచారు ఆలియా. ‘‘మా మధ్య ఉన్నది బంధం కాదు. స్నేహం. ఎంతో నిజాయతీతో కూడిన చెలిమి. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. మబ్బుల్లో తేలియాడుతున్నాను.. చుక్కలను తాకుతున్నాను. ఈ స్నేహంలో మేం మా వ్యక్తిగత జీవితాలను జీవిస్తూ.. ఎలాంటి ఆటంకం లేకుండా మా వృత్తిలో కొనసాగుతున్నాం. ఈ మైత్రిబంధంలో ఎంతో సౌకర్యవంతంగా.. సంతోషంగా ఉ‍న్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు ఆలియా. 

ఆలియా, రణ్‌బీర్‌ అభిమానులు వీరి వివాహం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే వీరిద్దరు కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆలియా గంగూబాయ్‌ కతియావాడి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో బిజీగా ఉండగా.. రణ్‌బీర్‌ షంశేరా, టైటిల్‌ ఖరారు కానీ మరొక చిత్రంలో నటిస్తున్నారు. 

చదవండి: నా కొడుకు లవ్‌ బ్రేకప్‌కు ఆ హీరోయిన్లే కారణం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు