ఆగిపోయిన రౌడీ-సుకుమార్‌ మూవీ.. క్లారిటీ వచ్చేసింది!

19 Apr, 2021 20:24 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు దర్శకుడు సుకుమార్‌. ఈ మూవీ అనంతరం యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండతో కలిసి ఓ సినిమాను పట్టాలెక్కించాల్సి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు బయటకు రాకపోవడంతో సినిమా ఆగిపోయిందని పుకార్లు వినిపిస్తున్నాయి. అదే విధంగా పుష్ప సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడని టాక్‌ వచ్చింది. దాంతో ఇక రౌడీతో సినిమా వాయిదా పడిందని అంతా అనుకున్నారు. కాగా తాజాగా సుకుమార్‌- విజయ్‌ దేవరకొండ సినిమాపై ఓ క్లారిటీ వచ్చింది. 

ఈ సినిమాకు చెందిన నిర్మాణ సంస్త ఫాల్కన్‌  అధికారికంగాఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. విజయ్‌ దేవరకొండతో సుకుమార్‌ చేయబోయే సినిమా తొందరలోనే ఉంటుందని స్పష్టం చేసింది. దర్శకుడు సుకుమార్‌, హీరో విజయ్‌ దేవరకొండ కలయికలో ప్రతిష్టాత్మకంగా తొలి ప్రాజెక్టును ఫాల్కన్‌ ప్రకటించింది. సుక్కు, రౌడీ ముందుగా కమిట్‌ అయిన చిత్రాలు పూర్తయిన వెంటనే ఈ సినిమా మొదలవుతుందని పేర్కొంది. ఇక మూవీకి సంబంధించి ఎలాంటి రూమర్లు నమ్మవద్దని కోరింది. ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదని, అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమా భారీగా తెరకెక్కనుందని ఫాల్కన్‌ టీమ్‌ ప్రకటించింది. 2022లో షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు వెల్లడించింది.

చదవండి: కొట్టడం అంటే ఓకే కానీ.. కిడ్నాప్‌ అంటే రిస్క్‌

రామ్‌ చరణ్‌ మూవీ: జర్నలిస్టుగా రష్మిక!

A post shared by FalconCreationsLLP (@falconcreationsllp)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు