Allu Arjun: 'మమ్మల్ని మళ్లీ గర్వపడేలా చేశారు':

8 Dec, 2023 15:05 IST|Sakshi

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం  యానిమల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించారు. అభిమానుల భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ చిత్ర దర్శకుడిని ఆకాశానికెత్తేశారు. ప్రత్యేకంగా ఆర్జీవీ రివ్యూ సైతం రిలీజ్ చేశారు. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యంగ్ హీరోయిన్ మృతి!)

అయితే తాజాగా ఐకాన్ స్టార్ బన్నీ సైతం ఈ చిత్రంపై మనసు పారేసుకున్నారు. ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్‌, సినిమా బ్రిలియెన్స్‌ అద్భుతమన్నారు. రణ్‌బీర్‌ కపూర్ భారతీయ సినిమాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారని.. స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. రష్మిక నటన బ్రిలియంట్ అని.. అత్యుత్తమ నటన కనబరిచిందని శ్రీవల్లిని పొగిడారు. బాబీ డియోల్, అనిల్ కపూర్ అద్భుతంగా నటించారన్నారు. మరో నటి త్రిప్రి డిమ్రీ నటనతో ఎందరో హృదయాలను కొల్లగొట్టిందని ప్రశంసించారు. యానిమల్ చిత్రబృందానికి అభినందనలు ట్వీట్ చేశారు. 

సందీప్‌ గురించి రాస్తూ.. 'దర్శకుడు సందీప్ మీరు అన్ని సినిమా పరిమితులను అధిగమించారు. మీరు మరోసారి మా అందరినీ గర్వపడేలా చేశారు. మీ సినిమాలు భవిష్యత్తులో భారతీయ సినిమా ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది!' అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా యానిమల్ కచ్చితంగా ఇండియన్ సినిమా క్లాసిక్‌ మూవీస్ లిస్ట్‌లో చేరుతుందని పోస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

(ఇది చదవండి: ఆయన లేకుండా నా కెరీర్‌ ఊహించుకోలేను.. సిమ్రాన్‌ భావోద్వేగం)

>
మరిన్ని వార్తలు