Sai Dharam Tej : 'సుప్రీమ్' హీరో పెళ్లిపై హింట్‌ ఇచ్చిన అల్లు శిరీష్‌

17 Oct, 2021 13:46 IST|Sakshi

Sai Dharam Tej Marriage: సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారా? మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచులర్‌ లిస్ట్‌ నుంచి త్వరలోనే తప్పుకోనున్నారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్‌. ఇటీవలె రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్‌ పూర్తిగా కోలుకొని విజయ దశమి సందర్భంగా హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే అదేరోజు సాయి తేజ్‌ పుట్టిరోజు కూడా ఉండటంతో మెగా ఫ్యామిలీలో ఆనందం మరింత రెట్టింపయ్యింది. చదవండి: 'మా' ఎన్నికలపై ఆర్జీవీ సెటైర్లు.. ట్వీట్‌ వైరల్‌

ఈ సందర్బంగా తేజ్‌ కజిన్స్‌ అతనికి వెల్‌కం హోం అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. ఇందులో సుష్మిత కొణిదెల, శ్రీజ, నిహారిక, అల్లు శిరీష్‌ సహా మిగతా కజిన్స్‌ సైతం తేజ్‌కు ఎంతో ప్రేమగా విషెస్‌ చెప్పారు. అయితే శిరీష్‌ మాట్లాడుతూ.. సింగిల్‌గా ఇదే నీ చివరి బర్త్‌డే అవ్వాలనుకుంటున్నా. ఈ మ్యారేజ్‌ రేస్‌లో నువ్వు నన్ను బీట్‌ చెయ్యాలనుకుంటున్నా అని సాయి తేజ్‌ పెళ్లిపై హింట్‌ ఇచ్చేశాడు. దీంతో ఇప్పటికే సంబంధాలు చూస్తున్నారని, త్వరలోనే సాయి తేజ్‌ పెళ్లిపై క్లారిటీ రానుందని మెగా ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వైరల్‌: షో మధ్యలో బాలయ్యకు ఫోన్‌ చేసిన రోజా

A post shared by Niharika Konidela (@niharikakonidela)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు