సీరియల్‌ యాక్టర్‌గా మారిన బ్లాక్ బస్టర్ మూవీ హీరో

30 Jan, 2023 20:15 IST|Sakshi

2001లో విడుదలైన తెలుగు సినిమా ఆనందం మీకు గుర్తుందా? ఆ సినిమాలో హీరో  మీకు గుర్తున్నారా? అతనేనండి  జై ఆకాశ్. ఆ ఆనందం హీరో ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? అతను త్వరలోనే ఓ తెలుగు సీరియల్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు. మీరు విన్నది నిజమే. అప్పుడు సినిమా హీరో.. ఇప‍్పుడు సీరియల్ హీరోగా మరోసారి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సీరియల్‌ సెట్స్‌లో చిత్రాలను ఆయన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు.  అక్కడే జై ఆకాశ్‌తో పాటు మోనిషా, జబర్దస్త్ ఫేమ్ సన్నీ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. 

కాగా.. జై ఆకాశ్ తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించారు.  శ్రీలంకలో జన్మించిన ఆకాశ్ ఆ తర్వాత యూకేలోని లండన్‌లో స్థిరపడ్డారు.  కె బాలచందర్ నిర్మించిన రోజావనం (1999) చిత్రంలో రెండో ప్రధాన పాత్ర కోసం ఎంపికయ్యారు. ఆ తర్వాత 2001లో వచ్చిన ఆనందం చిత్రంతో తెలుగులో అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. పలు తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. ఆకాశ్ చివరిసారిగా 2010లో నమో వెంకటేశ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత మరోసారి తెలుగు చిత్రసీమలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. జై ఆకాశ్ నటించిన రాబోయే డైలీ కొత్త టీవీ షో పేరు 'గీతాంజలి'లో నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ బుల్లితెర నటి సుజిత ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

A post shared by Jai Akash (@jaiakash252)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు