సోషల్‌ మీడియా ఎంతో మంది ప్రాణాలు కాపాడింది: అనన్య

30 Jun, 2021 22:59 IST|Sakshi

మనలో చాలా మంది సోషల్ మీడియాని వాడుతుంటాం గానీ నెగిటివ్‌గా చూస్తున్నాం, అందులోనూ పాజిటివ్‌ ఉందంటోంది బాలీవుడ్‌ మద్దు గుమ్మ అనన్య పాండే. ఈ అమ్మడు సోషల్‌ మీడియా గురించి మాట్లాడుతూ.. కోవిడ్‌ సమయంలో కొందరు మానవత్వంతో పలువురికి సహాయం చేయడం సోషల్ మీడియాలో చూశాను. ఎటువంటి పరిచయం లేని వాళ్లకు నిస్వార్థంగా సహాయం చేయడం, సమాచారం పంచుకోవడం లాంటివే గాక ఎంతోమంది ప్రాణాలను కూడా మనం దీని కారణంగానే కాపాడుకోగలిగామని తెలుపుతూ ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేసింది.

ఇటీవల పలువురు సోషల్‌ మీడియాని ద్వారా స్వచ్చందంగా చేసిన పనులు చూసి నాకు దానిపై మరింత నమ్మకాన్ని పెరిగేలా చేశాయి. ఈ కారణంగానే ప్రస్తుతం  ‘సోషల్ మీడియా ఫర్ సోషల్ గుడ్’ అనే ఒక సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగా నేను కొంతమంది సోషల్‌ మీడియా హీరోలతో మాట్లాడబోతున్నాను’’ అంటూ తెలిపింది.  కాగా.. అనన్య వస్త్రధారణ విషయంలో గతంలో సోషల్‌ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కోవడం గమనార్హం.

దానిపై స్పందించిన ఆమె తాను ఏ దుస్తులు ధరించినా నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తూనే ఉంటారని చెప్పుకొచ్చింది. తెలుగులోనూ సందడి చేసేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమైంది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘లైగర్‌’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయం కానుంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

చదవండి: వెరైటీ లుక్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు