లైవ్‌లో ఫోన్‌ నెంబర్‌ అడిగిన నెటిజన్‌.. వెంటనే ఇచ్చేసిన శ్రీముఖి

26 May, 2021 14:50 IST|Sakshi

యాంకర్‌ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్‌ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేయడం,  హాట్ హాట్ ఫొటోషూట్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తుంది.

ఇక ఈ బ్యూటీ లైవ్‌లోకి వచ్చిందంటే చాలు.. నెటిజన్లు తమ ధర్మ సందేహాలన్నింటిని బయటపెడతారు. శ్రీముఖి కూడా ఓపికగా, తనదైన శైలీలో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా  లైవ్ చిట్ చాట్ చేసిన ‘రాములమ్మ’ఏకంగా ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. 


ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాలు ఇండియాలో బ్యాన్ కాబోతున్నాయని వార్తలు రావడంతో వెంటనే లైవ్ లోకి వచ్చింది శ్రీముఖి. మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఓపెన్‌గా అడిగేయండి అంటూ ఆఫర్ ఇవ్వడంతో నెటిజన్లు రెచ్చిపోయారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ బ్యాన్ అయితే మీతో మాట్లాడటం ఎలా అక్కా? ఎస్సెమ్మెస్‌లొ మాట్లాడుకుందాం అక్క  టోల్ ఫ్రీ నెంబర్ చెప్పు అని ఓ నెటిజన్‌ అడిగాడు. దీంతో వెంటనే ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన 9848032919 నెంబర్ ను శ్రీముఖి ఇచ్చింది.  వీటితో పాటు తన పెళ్లి, రిలేషన్‌షిప్‌పై అడిగిన ప్రశ్నలకు కూడా శ్రీముఖి ఫన్నీ సమాధానాలు ఇచ్చి నవ్వులు పూయించింది. 

మరిన్ని వార్తలు