బ్లూ దోస వీడియో వైరల్: నెటిజన్లు మాత్రం..!

13 Nov, 2023 19:31 IST|Sakshi

Blue Pea Dosa దక్షిణ భారత వంటకాలు అందులోనూ దోస అంటే  నోరు ఊరనిది ఎవరికి.  పళ్లు లేని వారుకూడా నమల గలిగేలా మెత్తగా  దూదపింజ లాంటి దోస మొదలు కర కరలాడే దోస,  మసాలా దోస, ఉల్లి దోస,  చీజ్‌ కార్న్‌ దోస అబ్బో ఈ లిస్ట్‌ పెద్దదే.  ఇక దీనికి సాంబారు తోడైతే  ఇక చెప్పేదేముంది. అంత క్రేజ్‌  దోస అంటే.  తాజాగా కొత్త రకం దోసం ఒకటి  వైరల్‌గా మారింది.  శంఖు పుష్పాలు, లేదా అపరాజిత పూలతో  ఇలాంటి ప్రయోగాలు సోషల్‌ మీడియాలో చాలానే చూశాం. గతంలో   బ్లూ రైస్‌ వీడియోకూడా వార్తల్లో నిలిచింది. ఇపుడు  బ్లూ పీ దోస అన్నమాట. 

జ్యోతీస్‌ కిచెన్‌ అనే ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో బ్లూ పీ దోస  ఇపుడు నట్టింట వైరల్‌గా మారింది.  నీలి రంగు అపరాజిత పూలను ఉడికించిన నీళ్లలో  దోస పిండి కలిపి దోస  తయారీ అవుతోంది. ముఖ్యంగా చక్కటి నీలి రంగులో నోరూరించే దోస రడీ కావడం  విశేషంగా నిలిచింది.  ఇప్పటి 10 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ దోస వీడియోపై Instagram యూజర్లు మిశ్రమంగా స్పందించారు. వావ్ చాలా అద్భుతంగా ఉంది.. బ్యూటిఫుల్‌ కలర్‌ అని కొంతమంది కమెంట్‌ చేశారు. అవును.. శంఖు పూలు ఎడిబుల్‌.. ఈ పూలతో చేసిన టీ చాలా బావుంటుంది అంటూ ఒక యూజర్‌ కమెంట్‌ చేశారు.

మరికొంతమంది మాత్రం అరే ఎందుకురా..అందమైన దోసను ఇలా పాడు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరి కొంతమందయితే  విచిత్రమైన దోసలతో పాపులరైన మరోఫుడ్‌ బ్లాగర్‌కి ట్యాగ్‌ చేశారు.  రివ్యూ చే బ్రో... ఎక్కడున్నావ్‌..లాంటి ఫన్నీ కామెంట్లు  కూడా ఉన్నాయి.

A post shared by jyotiz kitchen (@jyotiz_kitchen)

మరిన్ని వార్తలు