ఓటీటీకి ‘యాంగర్‌ టేల్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

26 Feb, 2023 23:11 IST|Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓటీటీ సినిమాల సందడి కనిపిస్తోంది. తాజాగా మరో వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. దర్శకుడు వెంకటేశ్‌ మహా, సుహాస్‌, బిందు మాధవి, మడోనా సెబాస్టియన్‌, రవీంద్ర విజయ్‌, ఫణి ఆచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘యాంగర్‌ టేల్స్‌’. ప్రభల తిలక్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ మార్చి 9వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు.

 ఈ సందర్భంగా సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎన్నో ఆశలతో ఉన్న నలుగురు వారికి నచ్చని జీవితం ఎదురైతే వారి మానసిక సంఘర్షణ ఏంటి? దాని వల్ల వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. నటుడు సుహాస్‌ ఈ సిరీస్‌ను నిర్మిస్తుండటం విశేషం.
 

మరిన్ని వార్తలు