20 ఏళ్ల తర్వాత సందర్శించా: అనిల్‌ కపూర్‌

6 Sep, 2020 20:23 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ ఎప్పుడు హుషారుగా తన అభిరుచులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తు అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తనకిష్టమైన అలీబాగ్‌ ప్రదేశాన్ని 20ఏళ్ల తర్వాత సందర్శించినట్లు తెలిపారు. అనిల్‌ కపూర్‌ తెల్లషర్ట్ నీలి రంగు పాయింట్‌ వేసుకొని ఎంజాయ్‌ చేస్తున్న దృష్యాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. మీకు 63సంవత్సరాలంటే నమ్మలేమని చాలా యంగ్‌ కనిపిస్తున్నారని అనిల్‌ కపూర్‌ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కాగా అనిల్‌ కపూర్‌ సందర్శించిన బీచ్‌ చెట్లు, నీటితో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మహారాష్ట్ర ప్రదేశంలొ ఉన్న అలీబాగ్‌ ప్రదేశం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల  ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫిజికల్ ఫిట్ నెస్ వ్యాయామం చెస్తున్న దృష్యాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనిల్ కపూర్ తన ఫిట్ నెస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.  దీనికి "ముఖం కంటే కండరాలు బాగా కనిపించినప్పుడు" అనే క్యాప్షన్ అనిల్ కపూర్ జోడించిన సంగతి తెలిసిందే. (చదవండి: అనిల్ కపూర్ "కిల్లర్ కాంబో'' వైరల్)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు