యానిమల్‌లో రణ్‌బీర్‌కు సోదరిగా నటించిందెవరో తెలుసా? హీరోయిన్‌ కంటే తక్కువేం కాదు!

26 Nov, 2023 10:59 IST|Sakshi

అర్జున్‌ రెడ్డి.. ఈ సినిమాతో హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాకు ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది. దీని తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సరే అందరూ సందీప్‌ను అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ అనే పిలుస్తూ వస్తున్నారు. ఆ రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిందీ మూవీ. అయితే సందీప్‌ రెడ్డి ఈసారి అంతకుమించిన వయొలెన్స్‌ చూపించేందుకు రెడీ అయ్యాడు.

యానిమల్‌.. హీరో సోదరి ఎవరు?
యానిమల్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించారు. సుమారు మూడున్నర గంటల నిడివితో ఉన్న యానిమల్‌ చిత్ర ట్రైలర్‌ ఇటీవలే రిలీజ్‌ చేయగా అది తెగ వైరలయింది. ఇందులో బాబీ డియోల్‌, అనిల్‌ కపూర్‌, సురేశ్‌ ఒబెరాయ్‌ వంటి బడా స్టార్స్‌ నటించారు. అయితే రణ్‌బీర్‌ సోదరిగా నటించిన నటి ఎవరని అందరూ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో చూసేద్దాం...

డిజైనర్‌ నుంచి నటిగా..
హీరో సోదరిగా నటించిన ఆమె పేరు సలోని బాత్రా. పుట్టింది ఢిల్లీలో.. చదివింది చెన్నైలో! ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకున్న సలోని మొదట డిజైనర్‌ మాలిని అగర్వాల్‌ దగ్గర స్టైలిస్ట్‌గా చేరింది. 2013లో ద అన్‌నేమ్‌డ్‌ క్రైమ్‌ అనే షార్ట్‌ ఫిలింలో నటించింది. తర్వాత బుల్లితెరపై లైఫ్‌ సహీ హై అనే సీరియల్‌లో నటించింది. ఈ సిరీస్‌లో నేహా పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె షార్ట్‌, ఫీచర్‌ ఫిలింస్‌ చేసింది. పర్చాయే: ఘోస్ట్‌ స్టోరీస్‌, వైట్‌ మ్యాటర్స్‌, తైష్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె యానిమల్‌ కాకుండా 200: హల్లా హో, ద నాట్‌ సినిమాలు చేస్తోంది.

A post shared by Saloni Batra (@saloni_batra_)

A post shared by Saloni Batra (@saloni_batra_)

చదవండి: 2023 లో చిన్న చిత్రాల హవా.. బడ్జెట్‌కు మించి ఎన్నో రెట్ల లాభాలు!

మరిన్ని వార్తలు