ప్రభాస్‌ 'సలార్‌' షర్ట్‌ కావాలంటే ఇలా పొందండి.. ధర ఎంతో తెలుసా?

26 Nov, 2023 09:41 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా సలార్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్‌ నీల్‌. భారీ బడ్జెట్‌తో 'హోంబలే ఫిల్మ్స్‌' ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌ నటిస్తున్నారు. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

డిసెంబర్ 1న 'సలార్' ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. త్వరలో సలార్‌ కోసం ఒక భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసే పనిలో 'హోంబలే ఫిల్మ్స్‌' ఉంది. ఇందుకోసం డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్, టీజర్ హిట్ కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. హోంబలే సంస్థ మెల్లగా సలార్‌ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టింది.

ప్రస్తుతం 'సలార్' టీ షర్ట్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లో ప్రభాస్‌ అభిమానుల కోసం వీటిని విక్రయిస్తున్నారు. హోంబలే వెర్సెస్ (hombaleverse) వెబ్‌సైట్లో వీటిని విక్రయిస్తున్నారు. ఇందులో సలార్ టీ-షర్ట్, హూడీ, హార్మ్ స్లీవ్‌లను పొందవచ్చు. వీటిని కొనుగోలు చేయాలనుకున్న అభిమానులు హోంబలే వెర్సెస్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పొందవచ్చు.

వీటి ధరలను పరిశీలిస్తే, టీ-షర్టు ధర రూ.499 నుంచి ప్రారంభమై రూ.1499 వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆ టీ షర్ట్‌ ధరలను చూసి భయపడిపోతున్నారు. అంత ధర ఉంటే సామాన్యాలు ఎలా కొనాలి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాలు, స్టార్ నటీనటుల క్రేజ్ చూసి ఇంతకు ముందు ఇలాంటి టీ షర్టులు ఇతరులు అమ్మేవారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తోంది చిత్రబృందం.

షారూఖ్ ఖాన్ నటించిన 'డంకీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద 'సలార్'తో పోటీ పడుతోంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాబట్టి  బాక్సాఫీస్ వద్ద సలార్‌తో క్లాష్ అని భావిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమై విశేష స్పందన లభించింది. డిసెంబర్‌ 22న సలార్‌ 5000 థియేటర్లకు పైగా విడుదల కానుంది.

మరిన్ని వార్తలు