క్యాస్టింగ్‌ కౌచ్‌.. అక్కడి నుంచి లేచి వెళ్లిపోతా: బుల్లితెర నటి

8 Oct, 2021 17:38 IST|Sakshi

నటి మదాలస శర్మ తెలుగు, తమిళ, పంజాబీ చిత్రాల్లో నటించింది. కానీ ఎన్ని ప్రాజెక్టులు చేసినా తగినంత గుర్తింపు రాకపోవడంతో హిందీ బుల్లితెరపై వాలింది. అక్కడ అనుపమ సీరియల్‌ ద్వారా కావాల్సినంత క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడింది. 'ఏ వృత్తిలో అయినా, ఎక్కడికి వెళ్లినా.. ఒక అమ్మాయి ఉందంటే చాలు ఆమె చుట్టూ పురుషులు కూడా ఉంటారు. కొన్నిసార్లు వాళ్లు ఆమె మీద ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే వారి ప్రవర్తనను బట్టి ఎలా మసలుకోవాలనేది మన చేతిలోనే ఉంటుంది.'

'కొందరు మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ప్రభావితం కావడం, కాకపోవడం కూడా మన చేతిలోనే ఉంటుంది. దాన్ని వేరెవరూ మార్చలేరు. నాకైతే ఎవరైనా ఉన్నప్పుడు సౌకర్యంగా అనిపించకపోతే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాను. అప్పుడు నన్నెవరూ ఆపరు కదా! నేను ఒక నటిని, నా ప్రతిభను చాటుకునేందుకు ఇక్కడిదాకా వచ్చాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా నాకుంది' అని మదాలస చెప్పుకొచ్చింది. కాగా మదాలసకు గతంలో బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిందని, కాకపోతే అప్పటికే తనకు చేతినిండా ప్రాజెక్టులు ఉండటంతో ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందని తెలిపింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు