Anushka Sharma and Virat Kohli: అనుష్క-విరాట్ ఫ్లాట్‌.. అద్దె ఎంతో తెలిస్తే షాక్..!

23 Nov, 2022 20:51 IST|Sakshi

బాలీవుడ్ నటి అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ జంట గురించి పరిచయం అక్కర్లేదు. టీ20 వరల్డ్‌ కప్‌లో అత్యుత్తమంగా రాణించిన విరాట్ ప్రస్తుతం ముంబైలో ఫ్యామిలీ కలిసి ఉన్నారు. ఎప్పుడు బిజీగా ఉండే ఈ జంట తాజాగా ముంబైలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది.  అత్యంత ఖరీదైన జుహు ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌ను నెలకు దాదాపు రూ.2.76 లక్షల అద్దె చెల్లించనున్నట్లు తెలుస్తోంది.
 
నాల్గవ అంతస్తులో ఉండే ఆ భవనం 1,650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సముద్రానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో  రెండు భూగర్భ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 17న  రిజిస్ట్రేషన్ సమయంలో విరాట్ కోహ్లీ రూ.7.50 లక్షల డిపాజిట్ చెల్లించారు. ఈ అపార్ట్‌మెంట్ వడోదర రాజకుటుంబానికి చెందిన మాజీ క్రికెటర్ సమర్జిత్‌సింగ్ గైక్వాడ్‌కు చెందినదిగా సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్‌లో ఒక ఫామ్‌హౌస్‌ను రూ.19.24 కోట్లతో కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తోంది. జిరాద్ గ్రామ సమీపంలోని 8 ఎకరాల స్థలంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

ప్రస్తుతం అనుష్క చక్దా ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా 2018 తర్వాత ఆమె మరోసారి తెరపై కనిపించనుంది. చక్దా ఎక్స్‌ప్రెస్‌కు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇది భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా స్పోర్ట్స్ బయోపిక్. ఈ చిత్రంలో అనుష్క తన కెరీర్‌లో తొలిసారిగా క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. చక్దా ఎక్స్‌ప్రెస్ మూవీ వామిక పుట్టిన తర్వాత చేస్తున్న మొదటి సినిమా. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో రిలీజ్ అవుతుంది.

మరిన్ని వార్తలు