పంచ్‌ ప్రసాద్‌కు ఆపరేషన్‌.. అండగా ఏపీ ప్రభుత్వం

9 Jun, 2023 15:05 IST|Sakshi

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.  కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్‌ చేయించుకుంటున్నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్‌ కమెడియన్‌ నూకరాజు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

(ఇది చదవండి: విషమంగా పంచ్‌ ప్రసాద్‌ ఆరోగ్యం.. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు!)

వీలైనంత త్వరగా అతడికి ఆపరేషన్‌ చేయాలని, అందుకు చాలా ఖర్చవుతుందని, దాతలు సాయం చేయాలని కోరాడు. పంచ్‌ ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

పంచ్‌ ప్రసాద్‌కు ఆపరేషన్‌.. అండగా ఏపీ ప్రభుత్వం
పంచ్‌ ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు మంత్రి ఆర్‌కే రోజా. ఈ మేరకు స్పందించిన సీఎం జగన్‌.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా పంచ్‌ ప్రసాద్‌కి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న పంచ్‌ ప్రసాద్‌కి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఏపీ ప్రభుత్వం వైద్యం చేయిస్తోంది. 

అంతకుముందు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమాలన్నీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణకు ఒక నెటిజన్ ట్యాగ్ చేశారు. దీంతో  ఈ విషయంపై సీఎం ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ స్పందించారు. ఇప్పటికే తమ టీం పంచ్ ప్రసాద్ కుటుంబసభ్యులతో టచ్‌లో ఉందని వెల్లడించారు. వారితో లెటర్‌ ఆఫ్ క్రెడిట్ అప్లై చేసేందుకు ప్రయత్నాలు చేసేందుకు కృషి చేస్తున్నామని ట్వీట్ చేశారు. డాక్యుమెంట్లను పరిశీలించి వీలైనంత త్వరగా క్లియర్ చేసే ప్రక్రియ మొదలవుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దీంతో మంచి ప్రసాద్‌కి త్వరలోనే సర్జరీ జరిగి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. 

(ఇది చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన బుల్లితెర నటి తండ్రి)

మరిన్ని వార్తలు