ఎంటర్‌టైన్‌ చేయడానికి ‘ఏనుగు’గా వస్తున్న తమిళ్‌ ‘యానై’

10 Jun, 2022 14:58 IST|Sakshi

ఢిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచుకున్నాడు సినియర్‌ నటుడు విజయ్‌ కుమార్‌ తనయుడు  అరుణ్ విజయ్. ఈ యంగ్‌ హీరో తాజాగా నటించిన చిత్రం ‘యానై’. ఈ మూవీ ఇప్పుడు ‘ఏనుగు’పేరుతో టాలీవుడ్‌లో జూన్‌ 17న విడుదల కాబోతుంది.  ఉత్తరాంధ్ర లో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసి, దనుష్‌ ‘ధర్మయోగి’తో నిర్మాతగా మారిన సీహెచ్‌ సతీష్‌ కుమార్‌.. విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాడు. 

హీరో సూర్య తో సింగం సిరీస్ , విశాల్ తో పూజ వంటి యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు హరి ఈ మూవీకి దర్శకత్వం వహించడం విశేషం. అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్,సముద్రఖని, కేజీయఫ్‌ ఫేమ్‌ రామచంద్రరాజు, రాధిక శరత్‌ కముఆర్‌, యోగిబాబు, అమ్ము తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. 

మరిన్ని వార్తలు