హీరో విశాల్‌పై సహాయ దర్శకుడి ఫిర్యాదు

2 Jul, 2021 09:13 IST|Sakshi

నటుడు విశాల్‌పై సహాయ దర్శకుడు విజయ్‌ ఆనంద్‌ నటుడు, శాసనసభ్యులు ఉదయనిధి స్టాలిన్‌కు ఫిర్యాదు చేశారు. అందులో ఆయన తాను గత 15 ఏళ్లుగా సహాయ దర్శకుడిగా సినీ పరిశ్రమలో పని చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల నటుడు విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న "చక్రం" సినిమాకి పని చేసే సమయంలో తాను రాసుకున్న 'కామన్‌మ్యాన్‌' కథ గురించి చెప్పానన్నారు.

అయితే విశాల్‌ తాను నటిస్తున్న తాజా చిత్రానికి తన "కామన్‌మ్యాన్‌" టైటిల్‌ను అక్రమంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే తన చిత్ర టైటిల్‌ వాడుకోమని ఆయనకు చెప్తే అప్పుడు ఆయన మౌనంగా ఉండి ఇప్పుడు తన అనుమతి లేకుండా టైటిల్‌ వాడుకోవాలని చూస్తున్నారన్నారు. తన చిత్ర టైటిల్‌ కింద "నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌" అనే ట్యాగ్‌లైన్‌ జోడించారు. దీని గురించి తాను విశాల్‌ను అడగ్గా ఆయన వర్గం తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని సహాయ దర్శకుడు విజయ్‌ ఆనంద్‌ ఆరోపించారు.

చదవండి: విశాల్‌ ఫిర్యాదు బాధించింది: నిర్మాత ఆర్‌బీ చౌదరి

మరిన్ని వార్తలు