`ఫ్రెండ్‌షిప్‌’లో వైవిధ్యంగా ఉంటుంది: నిర్మాత ఎ.ఎన్ బాలాజీ

20 Aug, 2021 19:14 IST|Sakshi

ఇండియ‌న్ మాజీ క్రికెట‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్, యాక్ష‌న్ కింగ్ అర్జున్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఫ్రెండ్‌షిప్‌’. జాన్ పాల్ రాజ్‌, శామ్ సూర్య ద‌ర్శ‌కులు.  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎ.ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేరోజున విడుద‌ల‌వుతున్న ఫ్రెండ్‌షిప్ చిత్రాన్ని తెలుగులో ఎ.ఎన్.బాలాజీ సెప్టెంబ‌ర్‌లో విడుదల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ.. ‘మ‌లయాళంలో అంద‌రూ కొత్త న‌టీన‌టుల‌తో చేసి సూప‌ర్ హిట్ అయిన `క్వీన్` సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని `ఫ్రెండ్‌షిప్‌` పేరుతో రీమేక్ చేశారు. హ‌ర్భ‌జ‌న్‌, అర్జున్ పోటాపోటీగా న‌టించారు. దాపు పాతిక కోట్ల రూపాయ‌ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా త‌ప్ప‌కుండా వైవిధ్యంగా ఉంటుంది. రాజ‌కీయాల‌కు, కాలేజ్ స్టూడెంట్స్ మ‌ధ్య ఏం జ‌రిగింద‌నే విషయాన్ని ఆస‌క్తిక‌రంగా, క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఎంగేజింగ్‌గా ద‌ర్శ‌కుడు జాన్ పాల్ రాజ్‌, శామ్‌ సూర్య‌ తెర‌కెక్కించారు. సినిమా ఐదు భాష‌ల్లో(తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం) విడుద‌ల‌వుతుంది. సెన్సార్‌కు సిద్ధమైంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేశాం. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తాం’అన్నారు. 

మరిన్ని వార్తలు