పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న 'బలమెవ్వడు' చిత్రం

29 Nov, 2021 16:29 IST|Sakshi

Balamevvadu Movie Post Production Works Completed: వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నించడానికి వస్తోంది 'బలమెవ్వడు' చిత్రం. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధృవన్‌ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్‌బీ మార్కండేయులు నిర్మించగా, సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్‌ నటులు పృథ్వీరాజ్‌, సుహాసిని కీలక పాత్రలు పోషిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీంత అందిస్తున‍్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌, ఎంఎం. కీరవాణి పాడిన టైటిల్‌ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆధరణ లభించింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. 

'ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత రీ-రికార్డింగ్‌ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ సత్తా ఏంటో తెలిసింది. ఆయన కెరీర్‌లోనే అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇచ్చిన భారీ చిత్రాల మధ్య చేరబోయే మొదటి చిన్న సినిమా బలమెవ్వడు కానుంది. ఈయన బీజీఎం సినిమాను థియేటర్‌ మెట్లు ఎక్కించేలా చేసింది. నటీనటులు, కథ, సంభాషణలు సినిమాకు ప్రధాన బలాలు. అతి త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం.' అని డైరెక్టర్‌ సత్య రాచకొండ తెలిపారు. 

మరిన్ని వార్తలు