బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్‌.. అసలు విషయం ఇదా..?

20 Feb, 2024 09:40 IST|Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ 74వ బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం వెనుక ఏమైనా సీక్రెట్‌ ఉందా అంటూ పలు ప్రశ్నలు వస్తున్నాయి. వాస్తవంగా పుష్ప 2 షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు అల్లు అర్జున్‌, సుకుమార్‌ విరామం తీసుకోకూడదని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కానీ ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్‌ జర్మనీకి వెళ్లి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇంతటి బిజీ షెడ్యూల్‌లో ఆయన జర్మనీ వెళ్లి అక్కడ పుష్ప పార్ట్‌ 1 చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం.

అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ నుంచి విరామం తీసుకొని  నిర్మాత మైత్రి రవిశంకర్‌తో కలిసి జర్మనీలోని బెర్లిన్‌కు వెళ్లడం పట్ల అందరూ ఆశ్చర్యపోయారు. కానీ వారు వెళ్లింది పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ స్థాయిలో ఉన్న సినీ ప్రేక్షకులకు పుష్పగాడిని పరిచయం చేయాలని వెళ్లినట్లు తెలుస్తోంది. 74వ బెర్లిన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పుష్పను ప్రదర్శించడం ద్వారా, వారు యూరప్ దేశాల నుంచి డిస్ట్రిబ్యూటర్‌లను పొందేందుకు అవకాశం దక్కుతుందని ప్లాన్‌ వేశారట. అక్కడ సొంత భాషలలో పుష్ప 2 చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారట.

ఈ వేడుక ద్వార అక్కడ డిస్ట్రిబ్యూటర్స్‌ను కొనుగొని పుష్ప చిత్రాన్ని పంపిణీ చేయాలని అనుకుంటున్నారట. ఈ విషయంలో పుష్ప టీమ్‌ పక్కా స్కెచ్‌తో ముందుకు వెళ్లుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బాహుబలి వంటి చిత్రాలు ఇతర దేశాల్లో సత్తా చాటాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ కూడా అంతర్జాతీయ మార్కెట్‌పై కన్నేశాడని చెప్పవచ్చు. అన్నీ అనుకూలిస్తే ఇతర దేశాల్లో పుష్పగాడు దుమ్మురేపడం ఖాయం అని చెప్పవచ్చు. 

పుష్ప 2 చిత్రం భారతదేశంలోనే 4-5 భాషలలో విడుదల కానుంది, ఈసారి, దర్శకుడు సుకుమార్ అనేక ఇతర భాషలలో కూడా  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నారు. పుష్ప రష్యన్ వెర్షన్ అంత గొప్పగా ఆడలేదు కానీ ఇప్పుడు పుష్ప 2 ద్వారా పక్కా ప్లాన్‌తో ఇతర దేశాల్లో ఎంట్రీ ఇవ్వాలని మేకర్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు