మోనాల్‌తో మాట్లాడ‌మ‌ని అభికి చెప్పేవాళ్లం: లాస్య‌

30 Nov, 2020 16:51 IST|Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లోకి వ‌చ్చాక వంట‌ల‌క్క‌లా మారిన లాస్య ప‌ద‌కొండో వారం ఎలిమినేట్ అయింది. అయితే షో నుంచి వెళ్లిపోతున్నాన‌న్న బాధ క‌న్నా త‌న కుటుంబాన్ని క‌లుస్తాన‌న్న సంతోష‌మే ఆమెను ఉక్కిరిబిక్క‌రి చేసింది. దీంతో ఆనందంగా హౌస్‌మేట్స్ ద‌గ్గ‌ర నుంచి వీడ్కోలు తీసుకుంది. ఇక‌ ఈ సీజ‌న్ మొత్తంలో హైలెట్‌గా నిలిచిన‌ అఖిల్‌, మోనాల్‌, అభిజిత్ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ గురించి యాంక‌ర్ లాస్య స్పందించింది. త‌ను చూసినంత‌వ‌ర‌కు హౌస్‌లో ల‌వ్‌స్టోరీలేమీ లేవ‌ని చెప్పుకొచ్చింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ బిగ్‌ షాక్‌‌.. వరస్ట్‌ పెర్ఫార్మర్‌గా అభిజిత్‌)

"అభిజిత్‌కు మోనాల్ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. పైగా ఒకే ఇంట్లో ఉండి మాట్లాడ‌క‌పోతే బాగోద‌ని ఆమెతో మాట్లాడ‌మ‌ని అభికి మేమే చెప్పేవాళ్లం. అటు అఖిల్, మోనాల్ కూడా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. అఖిల్ మోనాల్ త‌న బెస్ట్ ఫ్రెండ్ అని, మోనాల్ కూడా అఖిల్ త‌న బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పేవాళ్లు. ఎప్పుడూ వాళ్ల నోటి నుంచి ల‌వ్ అనేది రాలేదు. అలాంట‌ప్పుడు వాళ్ల మ‌ధ్య‌లో ఏదో ఉంద‌ని మేం ఎందుకు అనుకుంటాం?  కొన్ని మెంటాలిటీలు కొంద‌రికి మాత్ర‌మే ట్యూన్ అవుతారు. అలాగే నేను, అభి, నోయ‌ల్‌, హారిక‌లు ట్యూన్ అయ్యాం. అదే విధంగా అఖిల్ మోనాల్ క్లోజ్ అయ్యారు. నేనైతే వాళ్ల‌ను బెస్ట్‌ఫ్రెండ్స్ అనే అంటాను. అయితే ఎలాంటి క్లిప్పింగులు చూపించారో నాకు తెలీదు. కానీ బ‌య‌ట మాత్రం ఇది ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీలా క‌నిపించిందంటున్నారు. కానీ లోప‌ల మాత్రం అలాంటిదేమీ లేదు" అ‌ని లాస్య‌ స్ప‌ష్టం చేసింది. (చ‌ద‌వండి: టాప్ 2లో ఉండేది ఆ ఇద్ద‌రే: లాస్య‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు