మోనాల్‌కు మంచి చెప్పినా చెడే చేసింది

27 Oct, 2020 23:16 IST|Sakshi

ప్రారంభ‌మైన ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌

కేర్ టేక‌ర్ల‌ను ఆడుకుంటున్న చంటిపిల్ల‌లు

బిగ్‌బాస్ ఇంట్లో చిన్న‌పిల్లలు ఉంటే ఎలాగుంటుంది అనేది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు హౌస్‌మేట్స్‌. టాస్క్‌లో భాగంగా చిన్న‌పిల్ల‌ల్లా మారిపోయిన కంటెస్టెంట్లు వీళ్లు పిల్ల‌లు కాదు, పిడుగులు కూడా కాదు. రాక్ష‌సులు అనిపించారు. కేర్ టేక‌ర్ల‌కు అంత‌లా న‌ర‌కం చూపించారు. మ‌రోసారి సోహైల్‌, అరియానాకే జోడీ ప‌డింది. దీంతో త‌న‌ను నామినేట్ చేసిన సోహైల్‌కు అరియానా ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించింది. మ‌రి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో వాళ్లు ఎంత హంగామా చేశారు? హౌస్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేసేయండి..

నామినేట్ చేసినందుకు మాస్ట‌ర్ కంట‌త‌డి
అభిజిత్‌తో మాట్లాడి అన్నింటినీ క్లియ‌ర్ చేస్కో అని అఖిల్ మోనాల్‌కు సూచించాడు. ఆమె బాధ‌లో కూరుకుపోవ‌డంతో ఇత‌డే ముందుకు వ‌చ్చి పోనీ నేను మాట్లాడ‌నా అని అనుమ‌తి తీసుకుని అభిజిత్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. ఒక‌సారి కూర్చుని మాట్లాడుకుంటే క్లారిటీ వ‌స్తుంద‌ని అఖిల్ సూచించ‌డంతో అందుకు ఓకే చెప్పిన అభి రేపు మాట్లాడ‌దామన్నాడు. ఇక సోహైల్ నామినేట్ చేసినందుకు మాస్ట‌ర్ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే మాస్ట‌ర్‌ చేయెత్తి సైగ‌లు చేయ‌డం వ‌ల్లే త‌న‌ను నామినేట్ చేశాన‌ని సోహైల్ స్ప‌ష్టం చేశాడు. అయినా స‌రే అత‌డు అర్థం చేసుకోక‌పోవ‌డంతో ఫ్ర‌స్టేట్ అయ్యాడు. త‌ర్వాతి వారం నామినేష‌న్ కోసం ఇప్ప‌టినుంచే త‌న‌తో గొడ‌వ‌లు పెట్టుకోండని సోహైల్ ఇంటిస‌భ్యుల‌కు సూచించాడు.  (చ‌ద‌వండి: మా ఆయ‌నేంటో నాకు తెలుసు: మాస్ట‌ర్ భార్య‌ ఫైర్‌)

మోనాల్ ముద్దుతో గాల్లో తేలిన అవినాష్‌
గార్డెన్ ఏరియాలో అఖిల్‌, మోనాల్ ఒక‌చోట అరియానా, అవినాష్ మ‌రోచోట కూర్చుని ముచ్చ‌ట్లు పెట్టుకుంటున్నారు. మోనాల్‌ను చూసి అవినాష్‌ ఐ హేట్ యూ చెప్ప‌గా, అత‌డిని కూల్ చేసేందుకు ఆమె ప‌రుగెత్తుకుంటూ వెళ్లి నుదుటిపై ముద్దు పెట్టింది. ఊహించ‌ని ప‌రిణామానికి షాకైన అవినాష్‌.. నా పొలంలో మొల‌క‌లొచ్చాయ్ అంటూ సంతోషంతో ఎగిరి గంతేశాడు. మై హీరోయిన్ మోనాల్ అని గొంతు చించుకుని కేక‌లు పెట్టాడు. అస‌లైన A అవినాష్ అని అర్థ‌మైందంటూ సంబ‌ర‌ప‌డిపోయాడు. (చ‌ద‌వండి: చెండాల‌మైన కార‌ణాల‌తో నామినేట్ చేయకు)

మోనాల్ వ‌ల్ల అఖిల్, సోహైల్‌కు మ‌న‌స్ప‌ర్ధ‌లు
స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అంటూ అఖిల్, మెహ‌బూబ్‌ను నోయ‌ల్ నామినేట్ చేశాడ‌ని సోహైల్ అత‌నితోనే చ‌ర్చించాడు. ఇది విన్న మోనాల్.. అఖిల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి నీ గురించి సోహైల్ మాట్లాడుతున్నాడ‌ని చెప్ప‌డంతో మ‌న‌స్ప‌ర్ధ‌లు మొద‌ల‌య్యాయి. త‌న‌ గురించి ఏదో వెన‌కాల మాట్లాడుతున్నాడ‌ని అఖిల్ అన‌వ‌స‌రంగా ఏదేదో ఊహించుకుని ఫీల‌య్యాడు. దీంతో తానేమీ మాట్లాడ‌లేద‌ని సోహైల్ అఖిల్‌కు క్లారిటీ ఇచ్చాడు. ఇక‌ ఇక్క‌డి విష‌యాలు అక్క‌డ చెప్పొద్ద‌ని చెప్పినా ఎందుకు ఇలానే చేస్తున్నావ్ అని సోహైల్‌ మోనాల్‌ను నిల‌దీశాడు. (చ‌ద‌వండి: స‌మంత హోస్టింగ్‌పై నెటిజ‌న్ల రియాక్ష‌న్!)

అరియానా‌ను రెడీ చేసిన అవినాష్‌
బిగ్‌బాస్‌ 'బీబీ డేకేర్' అనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా అరియానా, అవినాష్‌, హారిక‌, మెహ‌బూబ్ చంటిపిల్ల‌లుగా మారిపోయారు. అవినాష్‌కు నోయ‌ల్‌, అరియానాకు సోహైల్, మెహ‌బూబ్‌కు అఖిల్‌, హారిక‌కు మోనాల్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు అభిజిత్ కేర్ టేక‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు.‌ లాస్య సంచాల‌కురాలిగా వ్య‌వ‌హరించింది. కేర్ టేక‌ర్లు పిల్ల‌ల‌కు అన్నం తినిపిస్తూ, బ‌ట్ట‌లు మారుస్తూ, డైప‌ర్లు వేయాల్సి ఉంటుంది. చ‌దువు చెప్ప‌డంతో పాటు ఎంట‌ర్‌టైన్ చేయాలి. వారికి కావాల్సినవ‌న్నీ స‌మ‌కూరుస్తూ ఏడుపు సౌండ్ వినిపించ‌గానే డైప‌ర్లు మార్చాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఒక‌రు విజేత‌గా నిల‌వ‌గా వారికి ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని బిగ్‌బాస్ చెప్పాడు.

సోహైల్‌కు టార్చ‌ర్ చూపిస్తున్న అరియానా
టాస్క్ మొద‌లు కాగానే పిల్ల‌లు పిడుగుల్లా మారిపోయి, ఆ త‌ర్వాత రాక్ష‌సుల్లా అవ‌త‌రించారు. మెహ‌బూబ్ కోరిక మేర‌కు అఖిల్ అత‌డిని ప‌దేప‌దే ఎత్తుకుని తిప్పాడు. అరియానా సోహైల్ మీద ఎక్కి చ‌ల్‌చ‌ల్ గుర్రం ఆడుకుంది. ఇక తోటి చంటోడైన‌ మాస్ట‌ర్‌ను హారిక రాచిరంపాన‌ పెట్టింది. సోహైల్ త‌న‌ను నాన్న అని పిల‌వ‌ద్ద‌ని ఎంత‌ మొత్తుకున్నా స‌రే అరియానా అత‌డిని ప‌దేప‌దే నాన్న అని పిలుస్తూ అమ్మ ఎక్క‌డ‌? అని ప్రశ్న‌లు కురిపించింది. త‌ర్వాత ఆమెను సోహైల్ భుజాల‌పై ఎత్తుకుని ఊరేగించాడు. ఆమె మాత్రం ముఖానికి రంగు పూస్తూ త‌ల‌పై నారింజ పొట్టు వేసి, పౌడ‌ర్ కొట్టి, పిల‌క వేసి నానా ర‌కాలుగా టార్చ‌ర్ పెట్టింది. త‌ర్వాత‌ పిల్ల‌లంద‌రికీ డైప‌ర్లు వేశారు. కొంటె హారిక అభిజిత్ మీద నీళ్లు పోస్తూ తెగ అల్ల‌రి చేసింది.

పెన్సిల్ కోసం హారిక‌, అరియానా ఫైట్‌
క్లాసులో ఏబీసీడీలు నేర్పుతున్న‌ సోహైల్‌ను పిల్ల‌లు తిక్క ప్ర‌శ్న‌ల‌తో విసిగించారు. ఎంత విసిగించినా స‌రే అత‌డు మాత్రం ఓపిక‌తో స‌మాధానాలు చెప్తూ ముఖం మీద న‌వ్వును చెర‌గ‌నీయలేదు. మాస్ట‌ర్ హారిక చాక్లెట్లు కొట్టేశాడు. త‌ర్వాత ఆమె కోపంతో అరియానా పెన్సిల్ కొట్టేయ‌డంతో ఇద్ద‌రూ త‌ల‌బ‌డ్డారు. చివ‌ర‌కు అరియానా త‌న పెన్సిల్‌ను తాను ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ దెబ్బ‌లు త‌గిలించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ టాస్క్ అయిపోయే స‌మ‌యానికి ఈ చిచ్చ‌ర‌పిడుగులు.. కేర్ టేక‌ర్ల‌ను ఎన్ని చెరువుల నీళ్లు తాగిస్తారో చూడాలి. (చ‌ద‌వండి: అభిజిత్‌కు అన్యాయం చేసిన అరియానా)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు