బిగ్‌బాస్‌: డైప‌ర్లు వేసుకున్న కంటెస్టెంట్లు!

27 Oct, 2020 18:57 IST|Sakshi

గ‌తం గ‌త‌: అనే మాట‌ వినే ఉంటారు. ఇది దేనికైనా వ‌ర్తిస్తుందేమో కానీ బిగ్‌బాస్‌కు వ‌ర్తించ‌దు. ఎందుకంటే సీజ‌న్లు మారినా టాస్కులు మాత్రం పాత‌వే క‌నిపిస్తాయి. బిగ్‌బాస్ టీమ్‌ పెద్ద‌గా శ్ర‌మించ‌కుండా గ‌త సీజ‌న్ల‌లోని టాస్కుల‌నే తిరిగి ప్ర‌వేశ‌పెడుతూ మ‌మ అనిపించేస్తోంది. అందులో భాగంగానే నేడు బిగ్‌బాస్ డేకేర్ టాస్కు జ‌ర‌గ‌బోతోంది. ఇందులో అల్ల‌రి బ్యాచ్ అవినాష్‌, అరియానా, హారిక‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో పాటు మెహ‌బూబ్ కూడా చిన్న‌పిల్లల్లా మారిపోయారు. వీరు గెట‌ప్‌తో పాటు డైపర్లు కూడా వేసుకోవ‌డం న‌వ్వు తెప్పిస్తోంది. మిగ‌తా ఇంటిస‌భ్యులు వారిని కంటికిరెప్ప‌లా చూసుకుంటూ చంటిపిల్ల‌ల్లా లాలించాల్సి ఉంటుంది. (వ‌ర్క‌వుట్ అయిన కిడ్నాప్‌; నాకిది అగ్ని ప‌రీక్ష‌)

అడిగిన‌వ‌న్నీ చేస్తూ ఏడవ‌కుండా చూసుకోవాలి. కానీ వాళ్లు మాత్రం ప‌సిపిల్ల‌ల‌ను మించిపోయేలా అల్ల‌రి చేస్తూ కేర్ టేక‌ర్ల‌ను ఏడిపించేస్తున్నారు. అరియానా సోహైల్‌ను నాన్న అని పిలుస్తూ అత‌డి భుజాల మీద ఎక్కి కూర్చుంది. అలాగే అవినాష్‌తో క‌లిసి సోహైల్‌ వీపు మీద కూర్చుని ఏనుగ‌మ్మ ఏనుగు ఆడుకుంది. ఇలా అంద‌రినీ విసిగించే క్ర‌మంలో హారిక మాస్ట‌ర్ ద‌గ్గ‌రి నుంచి ఏదో కొట్టేసింది. దీన్ని స‌ర‌దాగా తీసుకోని మాస్ట‌ర్ ఆమెను సైకోగా అభివ‌ర్ణిస్తూ అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. కాగా ఇల్లు పీకి పందిరేస్తున్న ఈ పిల్ల‌లు కేర్ టేక‌ర్ల‌ను ఎలా ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేవ‌ర‌కు ఎదురు చూస్తూ ఉండాలి. (సినిమాలు వ‌దులుకోమ‌న్నాడు, అత‌డినే వ‌దిలేశా: దివి)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు