దేవి నాగ‌వ‌ల్లికి దాస‌రి ఏమ‌వుతారో తెలుసా?

26 Sep, 2020 16:35 IST|Sakshi

బిగ్‌బాస్‌లో ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా ఎవ‌రి మాట‌కు లొంగ‌ని, ఎవ‌రినీ లెక్క చేయ‌ని ఏకైక వ్య‌క్తి, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ దేవి నాగ‌వ‌ల్లి. ఇప్ప‌టివ‌ర‌కు లేడీ బిగ్‌బాస్ విన్న‌ర్ లేరు. కాబ‌ట్టి తాను లేడీ బిగ్‌బాస్ అవుతాను అంటూ హౌస్‌లో అడుగు పెట్టారు. అక్క‌డ కూడా త‌న నైజం మార్చుకోలేదు. ఏ చిన్న త‌ప్పు జ‌రిగినా ప్ర‌శ్నించేందుకు రెడీగా ఉంటారు. అందుకే ఇత‌ర కంటెస్టెంట్లు కూడా ఆమెతో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇక దేవి బ‌ల‌మైన కంటెస్టెంటు కాబ‌ట్టే మొన్న‌టి ఉక్కు హృద‌యం టాస్క్‌లోనూ మొద‌ట ఆమెనే టార్గెట్ చేశారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మెహ‌బూబ్ బ్యాగు స‌ర్దేయ‌నున్నాడా?)

దేవి నాగ‌వ‌ల్లి గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. దివంగ‌త ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ రావుకు ఆమె ద‌గ్గ‌రి బంధువ‌ని చెప్తున్నారు. ఈ విష‌యాన్ని దేవి త‌ల్లి స‌త్య‌వ‌తి ఓ ఇంట‌ర్వ్యూలో ధ్రువీక‌రించారు. "దాస‌రి నారాయ‌ణ రావు.. మా అత్త‌గారి త‌మ్ముడు. మా ఆయ‌న‌కు మేన‌మామ‌. దేవికి తాత‌య్య అవుతారు‌. మాది రాజ‌మండ్రి. అక్క‌డికి వ‌చ్చిన‌ప్పుడు దాస‌రి మా ఇంటికి కూడా వ‌చ్చేవారు. దేవి ఉద్యోగం చేస్తుంద‌ని తెలిసి చాలా సంతోషించేవారు, ఆమెకు ఎంతో స‌పోర్ట్ చేసేవారు" అని తెలిపారు. నిజానికి దేవిని మూడో సీజ‌న్‌లోనే ర‌మ్మ‌న్నార‌ని, కానీ అప్పుడు కుద‌ర‌క‌పోవ‌డంతో ఈసారి వెళ్లింద‌ని స‌త్య‌వ‌తి పేర్కొన్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: గెలవడం‌ కోసం ఆమె ఏమైనా చేస్తుంది!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు