-
విశ్వక్సేన్కు సపోర్ట్.. టీవీ ఛానెల్‌పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు
హీరో విశ్వక్ సేన్- ఓ టీవీ యాంకర్ మధ్య జరిగిన వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదంలో కొందరు ఆ యాంకర్‌కు సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు విశ్వక్సేన్కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సైతం విశ్వక్సేన్కు సపోర్ట్‌గా నిలుస్తూ సదరు టీవీ ఛానెల్‌ను వరుస ట్వీట్స్‌తో ఏకిపారేశాడు. ఆయన ఏం అన్నారంటే.. 'ఇప్పుడు జరుగుతున్న ఈ సర్కస్ ఫీట్లో నేను కూడా భాగమవుదామనుకుంటున్నా.విశ్వక్సేన్ను అవమానించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జర్నలిస్టుల ముసుగులో వీళ్లు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ ఛానెల్ కేవలం డబ్బుల కోసమే న్యూస్ కవర్ చేస్తుంది. నీచమైన రూపంలో ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏమైనా చేస్తుంది. సదరు ఛానెల్ న్యూస్ తప్పా మిగతావన్నీ కవర్ చేస్తారని, వాళ్లకి పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయంటూ సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా ఈ మొత్తం ఇష్యూపై సదరు ఛానెల్ వాళ్లు పిలిస్తే లైవ్ డిబెట్లో పాల్గొంటా' అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. I’d like to be a part of the circus that is surrounding and humiliating a grounded, humble person as #VishwakSen He has my total support especially in light of how @TV9Telugu treated him. I don’t know what they do to journalists these days..jeez.. — Rahul Ramakrishna (@eyrahul) May 3, 2022 Their news is about monetary benefits. It is just shameful that people salivate for the kind of nonsense that they mostly* perpetuate. — Rahul Ramakrishna (@eyrahul) May 3, 2022 I really want @TV9Telugu to call me over for a live television debate. — Rahul Ramakrishna (@eyrahul) May 4, 2022 -
విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్
Danam Nagender Fires On Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్సేన్- ప్రముఖ టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన మాటల యుద్దంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరగుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్లో జరిగిన డిబెట్లో విశ్వక్ సేన్, సదరు యాంకర్ దేవీ నాగవల్లి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్ సేన్ అభ్యంతరకర ఎఫ్.. పదంతో దూషించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీనిపై మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: విశ్వక్సేన్పై మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రముఖ యాంకర్ ‘చానళ్లు విశ్వక్ సేన్ హీరోగా గుర్తిస్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ, మేం మాత్రం అతడిని హీరోగా గుర్తించడం లేదు. లైవ్‌లో ఇలాంటి అసభ్యకర పదాలు వాడటం కరెక్ట్ కాదు. దేవి నాగవళ్లికి యాంకర్‌గానే కాదు, బయట సమాజంలో కూడా మంచి పేరు ఉంది. అలాంటి యాంకర్‌ను పట్టుకుని అతడు అలా అనడం సహించరానిది. మీడియాలో మాట్లాడాల్సిన సమయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడు మాత్రమే మీడియా ముందుకు రావాలి. లేకపోతే సైలెంట్‌గా ఉండాలి. స్టూడియోలో విశ్వక్ సేన్ మాట్లాడిన మాటల మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి’ అన్నారు. లేకపోతే మహిళా సంఘాలతో కేసు పెట్టిస్తామని, అతను ఆ మాట అనగానే అదే వేదికపై యాంకర్ చెప్పుతో కొట్టేది ఉండే అని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ ‘విశ్వక్ సేన్ బయట కనపడితే మా మహిళలు చెప్పులు తీసుకుని కొడతారు. విశ్వక్ సేన్ లాంటి వ్యక్తికి బుద్ది చెప్పాల్సిందే. ఇంకోసారి మరెవరు ఇలాంటి పదాలు వాడకుండా చేయాలి. విశ్వక్ సేన్ లాంటి వాళ్లను సినిమాల్లోకి తీసుకోవద్దని దర్శక నిర్మాతలను కోరుతున్నాను’ అని దానం నాగేందర్ పేర్కొన్నారు. అయినప్పటికీ తమ మహిళ సంఘాలు ఆయనను కొట్టడానికి రెడీగా ఉన్నారని దానం హీరోపై ఫైర్ అయ్యారు. అనంతరం రోడ్లపై ఇలాంటి వ్యవహరాలు చేయడం. కిరోసిన్ డబ్బాను పట్టుకుని సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి ఆయన ఏమైన పెద్ద హీరో అనుకుంటున్నాడా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే యాంకర్ దేవి నాగవళ్లి ఫిర్యాదుతో విశ్వక్ సేన్‌పై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే. -
విశ్వక్సేన్పై మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రముఖ యాంకర్
యంగ్ హీరో విశ్వక్సేన్- టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన మాటల యుద్దంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరగుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్లో జరిగిన డిబెట్లో విశ్వక్ సేన్, సదరు యాంకర్‌కి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్ సేన్ అభ్యంతరకర ఎఫ్.. పదాన్ని వాడటం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఇదే అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి యాంకర్ దేవి నాగవల్లి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మంత్రి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విశ్వక్ సేన్ ప్రవర్తన బాగాలేదు. కశ్చితంగా చర్యలు ఉంటాయి. రోడ్డుపై న్యూసెన్స్ చేస్తా.. ప్రశ్నిస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతానంటే ఎవరూ ఊరుకోరు. ఆయన సారీ చెప్పిన పద్దతి కూడా సరిగా లేదు.ఈ విషయాన్ని మా అసోసియేషన్ దృష్టికి కూడా తీసుకెళ్తాం' అని పేర్కొన్నారు. -
యాంకర్ రవి సహా బిగ్‌బాస్‌లో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్స్ ఇవే..
Bigg Boss Telugu shocking Eliminations: బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్‌లో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ మాత్రం యాంకర్ రవిదే అని చెప్పొచ్చు. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా రవి ఎలిమినేట్ కావడం ప్రేక్షకులు ఎవరూ ఊహించలేదు. ఇది మోస్ట్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెటిజన్లు రవికి సపోర్ట్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్స్లతో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్స్‌ను ఏంటో ఓసారి చూద్దాం. సీజన్-1 బిగ్‌బాస్ సీజన్-1లో నటుడు ప్రిన్సీ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. టైటిల్ రేసులో ఉంటాడనుకున్న ప్రిన్సీ ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సీజన్-2 బుల్లితెరపై పలు టీవీ షోలతో అలరించే యాంకర్ శ్యామల బిగ్‌బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శ్యామల అంత త్వరగా ఎలిమేట్ కావడం షాకింగ్‌గా అనిపించింది. దీంతో ఇది అన్‌ఫెయిర్ అంటూ ఫ్యాన్స్ బాగా ఓట్లు వేసి రీఎంట్రీతో మరోసారి హౌస్‌లోకి పంపించారు. సీజన్-3 అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని అలీ రెజా బిగ్‌బాస్ ఎంట్రీతో పాపులర్ అయ్యాడు. అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన అలీ టాప్-5లో ఉంటాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సీజన్-4 బిగ్‌బాస్ సీజన్-4లో యాంకర్ దేవి నాగవల్లి ఎలిమినేషన్ అందరినీ కంటతడి పెట్టించింది. హౌస్‌లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న దేవీ మూడో వారమే ఎలిమినేట్ అవ్వడం ప్రేక్షకులను షాకింగ్‌కి గురిచేసింది. దీంతో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో దేవికి మద్దతుగా ఎంతోమంది నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్-5 బిగ్‌బాస్ సీజన్-5లో యాంకర్ రవి ఎంట్రీ నుంచే ఆయన టాప్-5అని అంతా భావించారు. సెపరేట్ ఫ్యాన్ బేస్, ఆటతీరుతో వాడే స్ట్రాటజీస్‌తో మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పటికీ రవి ఎలిమినేషన్‌ను ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.మోస్ట్ డిసర్వింగ్ కంటెస్టెంట్‌ను బయటకు పంపించారంటూ ఫైర్ అవుతున్నారు. ఇది మోస్ట్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. చదవండి: షణ్నూని ఇష్టపడుతున్నట్లు సిరి నాతో చెప్పింది: యాంకర్ రవి కొత్త ఇంట్లోకి యాంకర్ శ్యామల గృహప్రవేశం.. వీడియో వైరల్ Bigg Boss Telugu 5: అలా అనుకోవడం వల్లే యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడా? -
బిగ్‌బాస్ ఫినాలే: దేవి నాగవల్లి ఎక్కడ?
బిగ్‌బాస్ నాల్గో సీజన్ గ్రాండ్ ఫినాలే నేడు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా ఇప్పటికే రిలీజ్ చేసింది. హీరోయిన్లు ప్రణీత, మెహరీన్ డ్యాన్సులు, అనిల్ రావిపూడి పంచ్ పటాకాలతో షో డబుల్ జోష్‌తో ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ ఒకే చోట చేరి డ్యాన్సు చేయడం చూడముచ్చటగా ఉంది. కానీ ఆ గుంపులో దేవి నాగవల్లి మాత్రం కనిపించలేదు. ఇప్పటికే రీయూనియన్‌లో మోనాల్, లాస్య, సుజాత, గంగవ్వ, నోయల్, కుమార్ సాయి, అవినాష్, దివి, మెహబూబ్, కల్యాణి హౌస్‌లోకి వె్లి వచ్చారు. కానీ సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి మాత్రం వెళ్లలేదు. తాజా ప్రోమోలో దేవి నాగవల్లి తప్ప మిగతా ఇద్దరు కూడా స్టేజీపై కనిపించారు. దీంతో ఆమె ఎందుకు గ్రాండ్ ఫినాలేకు వెళ్లలేదన్న చర్చ నడుస్తోంది. అయితే ఆమె తన ఎలిమినేషన్‌పై అసంతృప్తితో ఉండటం వల్లే ఫినాలేకు హాజరు కాలేదని తెలుస్తోంది. కాగా లేడీ బిగ్‌బాస్ అవుతానంటూ షోలో ఎంట్రీ ఇచ్చిన దేవి నాగవల్లి మూడో వారంలోనే ఎలిమినేట్ అయింది. అప్పటివరకు ఆమెతో పెద్దగా కలిసినట్లు కనిపించని ఇంటిసభ్యులు దేవి వెళ్లిపోతుంటే మాత్రం కంటతడి పెట్టుకున్నారు. బిగ్‌బాస్ హౌస్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కోల్పోయిందని ఎంతోమంది ఫీలయ్యారు. అయితే ఉన్నన్ని రోజులు దేవి బిగ్‌బాస్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించేది. చాలామంది మొదట్లో రూల్స్ బ్రేక్ చేసి బిగ్‌బాస్ చేత అక్షింతలు వేయించుకునేవారు. ఓసారైతే ఇంటి సభ్యుల నిర్లక్ష్యానికి చిర్రెత్తిన బిగ్‌బాస్ అందరికీ చీవాట్లు పెట్టాడు. ఈ క్రమంలో క్షమించమంటూ కంటెస్టెంట్లు నిల్చుని రెండు చేతులు జోడిస్తూ వేడుకున్నారు. కానీ దేవి నాగవల్లి మాత్రం తను ఏ తప్పూ చేయలేదని దర్జాగా కూర్చుండిపోయి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇలా ఏ విషయంలోనైనా తనకంటూ ఓ క్లారిటీ ఉంటుంది. అలాగే సింగర్, డ్యాన్సర్‌గా తనలోని కొత్త కోణాలను సైతం అభిమానులకు పరిచయం చేసింది. (నోయల్ రాకతో అభిజిత్ ఎమోషనల్) కానీ మరీ తొందరగా మూడో వారంలోనే ఎలిమినేట్ కావడం ఆమె ఊహించలేకపోయింది. బయటకు వచ్చాక కూడా ఇదే అసంతృప్తిని వెల్లగక్కింది. 'బిగ్‌బాస్‌ను నమ్మి వెళ్లాను. నాకు ఓట్లు తక్కువ వచ్చాయి, కాబట్టి ఎలిమినేట్ అయ్యానన్నారు. కానీ బయట మాత్రం నాకు ఓట్లు ఎక్కువ వచ్చాయని చాలామంది అంటున్నారు. అంటే నాకంటే వెనక ఉన్నవాళ్లను వదిలేసి నన్ను ఎలిమినేట్ చేయడం షాకింగ్‌గా ఉంది. నా వల్ల స్క్రిప్ట్ మారిపోతుందని నన్ను పంపించేసి ఉండొచ్చు' అని బాధపడింది. బిగ్‌బాస్ షో తనకు ద్రోహం చేసిందన్న భావనతోనే ఆమె ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు వెళ్లడానికి నిరాకరించిందేమోనని నెటిజన్లు చర్చిస్తున్నారు. (బిగ్‌బాస్: చతికిలపడ్డ కంటెస్టెంట్లు వీళ్లే)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement