బిగ్‌బాస్ ట్విస్ట్‌: ఆ ఇద్ద‌రూ బ్యాగు స‌ర్దేశారు!

18 Oct, 2020 17:18 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదుగురు కంటెస్టెంట్లు సూర్య‌కిర‌ణ్‌, క‌ల్యాణి, దేవి, స్వాతి, సుజాత‌ ఎలిమినేట్ అయ్యారు. గంగ‌వ్వ స్వ‌చ్ఛందంగా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు ఏడో కంటెస్టెంటు బిగ్‌బాస్ షోకు వీడ్కోలు ప‌ల‌కాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. తక్కువ ఓట్లు వ‌చ్చిన మోనాల్ ఎలిమినేట్ అవుతుంద‌ని అంద‌రూ ఊహించారు. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ కుమార్ సాయి వెళ్లిపోనున్నాడ‌ని సోస‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో బిగ్‌బాస్ ఓ ట్విస్టు ఉండ‌బోతుందంటూ తాజాగా ప్రోమోను వ‌దిలాడు. ఈ రోజు రెగ్యుల‌ర్ ఎలిమినేషన్స్ జ‌ర‌గ‌ట్లేదు అని నాగ్ బాంబ్ పేల్చారు. అలా అని ఎలిమినేష‌న్ లేద‌ని అనుకునేరు. కానే కాదు ఇది డిఫ‌రెంట్ ఎలిమినేష‌న్ అంటూ ఇద్ద‌రు కంటెస్టెంట్ల‌ను బ్యాగు స‌ర్దుకోమ‌న్నాడు. ఆ ఇద్ద‌రు మోనాల్‌, కుమార్ అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: కుమార్ సాయి ఎలిమినేట్‌?)

ఇక ఈ ప్రోమోతో డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉండ‌బోతుందా అన్న అనుమానాన్ని ప్రేక్ష‌కుల మ‌న‌సులో నాటే ప్ర‌య‌త్నం చేశారు. కానీ నామినేష‌న్‌లో ఉన్న కంటెస్టెంట్ల‌ను చూస్తుంటే డ‌బుల్ ఎలిమినేష‌న్ చేయాల్సిన అవ‌స‌రం ఇప్పుడేమీ లేన‌ట్లు క‌నిపిస్తోంది. అయితే చాలామంది ఎలాగో కుమార్‌ను పంపిచేస్తున్నార‌ని, డ‌బుల్ ఎలిమినేష‌న్ పెట్టి మోనాల్‌ను కూడా వెళ్ల‌గొట్టండ‌ని సూచిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఇది డబుల్ ఎలిమినేష‌న్ కాదు, బిగ్‌బాస్ ఆడుతున్న డ‌బుల్ గేమ్ అని మండిప‌డుతున్నారు. కానీ అది బిగ్‌బాస్ హౌస్‌.. అక్క‌డేమైనా జ‌ర‌గొచ్చు. కాబ‌ట్టి నేడు హౌస్‌ను వీడేది ఒక్క‌రా? ఇద్ద‌రా అన్న విష‌యం తేలాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు స‌స్పెన్స్ భ‌రిస్తూ ఎదురు చూడాల్సిందే! (చ‌ద‌వండి: మార‌ని మాస్ట‌ర్‌, సోహైల్‌పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు