బిగ్‌బాస్‌: ఒక‌రు సేఫ్‌, మ‌రొక‌రు నామినేట్‌

20 Sep, 2020 23:04 IST|Sakshi

దేవిని నామినేట్ చేసిన క‌ల్యాణి

లీకు వీరులు చెప్పిన‌దానికి అటూఇటుగా బిగ్‌బాస్ షోలో నేడు ఫేక్ ఎలిమినేష‌న్ జ‌రిగింది. కాక‌పోతే హారిక‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపించ‌కుండా ఇంట్లోనే కొన‌సాగించారు. నిన్న ఎలిమినేట్ అయిన క‌రాటే క‌ల్యాణి హౌస్‌లో ఒక‌రిని నామినేష‌న్‌లోకి పంపించింది. వెళ్లిపోయే ముందు చివ‌రిసారిగా హ‌రిక‌థ చెప్పి మొద‌టిసారి ఔరా అనిపించింది. ఇంకా బిగ్‌బాస్ షోలో ఏమేం జ‌రిగాయో చ‌దివేసేయండి..

టాప్‌లో హారిక‌, లాస్ట్‌లో సోహైల్‌: క‌ల్యాణి
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ క‌ల్యాణితో నాగ్ ఓ గేమ్ ఆడించారు. అందులో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లో హారిక‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, మోనాల్‌, దివి, అభిజిత్ టాప్ 5లో ఉంటార‌ని తెలిపింది. అయితే మోనాల్ చుట్టూరా ముగ్గురు క‌ట్ట‌ప్ప‌లు ఉన్నార‌ని జాగ్ర‌త్త చెప్పింది. చివ‌రి ఐదు స్థానాల్లో గంగ‌వ్వ‌, కుమార్ సాయి, అరియానా, సుజాత‌, సోహైల్ ఉంటార‌ని కల్యాణి చెప్పుకొచ్చింది. మిగిలిన‌వారి గురించి మాట్లాడుతూ.. దేవి బ్రిలియంట్‌ అని ఆమెను త‌క్కువ అంచ‌నా వేయ‌కండ‌ని సూచించింది. అవినాష్- అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి, మెహ‌బూబ్- ఇంటిలిజెంట్‌, లాస్య - ఇన్నోసెంట్‌, అయోమ‌యమ‌ని తెలిపింది. అఖిల్‌కు త‌న‌లాగే ఆవేశ‌మెక్కువ‌ని, కొంద‌రిని దూరంగా ఉంచాల‌ని హిత‌బోధ చేసింది. త‌ర్వాత ఓ హ‌రిక‌థ చెప్పింది. అనంత‌రం దేవిని త‌ర్వాత వారానికి నామినేట్ చేస్తున్న‌ట్లు బిగ్‌బాంబ్ వేసింది. హౌస్‌లో క‌ట్ట‌ప్ప‌లు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌పడుతున్నార‌ని క‌ల్యాణి చెప్పుకొచ్చింది.

ప‌చ్చి మిర‌ప‌కాయ తిన్న మాస్ట‌ర్‌
త‌ర్వాత అభిజిత్‌, కుమార్ సాయి సేఫ్ అయ్యారు. అనంత‌రం ఇంటి సభ్యుల‌ను జంట‌లుగా విడికొట్టి బోన్ గేమ్ ఆడించారు. ఇందులో గుండంలో ఉన్న ఎముక‌ను పాట ఆగిపోగానే ఎవ‌రు ముందు తీసుకుంటే వాళ్లే గెలిచిన‌ట్లు. మొద‌ట‌గా వెళ్లిన జంట‌లో అఖిల్ గెల‌వ‌గా ఓడిపోయిన అభిజిత్ పుష‌ప్స్ చేశాడు. గెలిచిన మోనాల్‌ను హారిక రెండు పెదాలు క‌ల‌ప‌కుండా మాట్లాడుతూ పొగిడింది. అనంత‌రం మెహ‌బూబ్ గెల‌వ‌గా ఓడిన‌ సోహైల్ ప‌చ్చి ఉల్లిపాయ తిన్నాడు.

దేవి గెల‌వ‌గా అమ్మ రాజ‌శేఖ‌ర్ ప‌చ్చి మిర్చి క‌ర‌క‌రా న‌మిలేశాడు. ఆ క్ష‌ణ‌మే మాస్ట‌ర్‌ సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. త‌ర్వాత‌ సుజాత గెల‌వ‌గా, ఓడిన లాస్య చిన్న‌పిల్ల‌లా న‌టించింది. దివి గెల‌వ‌గా, ఓడిన‌ అరియానా అతి క‌ష్టం మీద‌ పోల్ డ్యాన్స్ చేసింది. గంగ‌వ్వ గెల‌వ‌గా, ఓడిన ‌కుమార్ సాయి నోట్లో నీళ్లు పోసుకుని పాట పాడేందుకు ప్ర‌య‌త్నించాడు. గెలిచిన అవినాష్‌ ఓడిన‌ నోయ‌ల్‌కుపెదాల‌కు మాత్ర‌మే కాకుండా ముఖ‌మంతా లిప్‌స్టిక్ రుద్దాడు. అనంత‌రం సోహైల్, నోయ‌ల్‌ సేఫ్ అయ్యారు. (ష‌ట‌ప్ లాస్య‌: టెంపర్ లూజైన దివి)

హారిక‌ను హౌస్‌లోకి ఎత్తుకొచ్చేశారు
నామినేష‌న్‌లో లేని ఏడుగురిలో అఖిల్‌, మెహ‌బూబ్, లాస్య, సుజాత‌‌.. హారిక ఎలిమినేట్ కావాల‌ని కోరుకోగా.. దేవి, అరియానా, దివి.. మోనాల్ వెళ్లిపోవాల‌ని కోరుకున్నారు. దీంతో మెజారిటీ ప్ర‌కారం హారిక ఎలిమినేట్ అయిన‌ట్లు తేలిపోయిన‌ప్ప‌టికీ మోనాల్ క‌న్నీళ్ల కుళాయి ఆన్ చేసింది. అనంత‌రం హారిక అంద‌రికీ గుడ్‌బై చెప్తూ గేట్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. ఇంటి స‌భ్యులు కూడా ఆమెకు భారంగా వీడ్కోలు చెప్తున్న స‌మ‌యంలో నాగ్.. ఆగండి అంటూ ఆమెను ఇంట్లోకి రావాల‌ని చెప్పారు.

దీంతో ఇది ఫేక్ ఎలిమినేష‌న్ అని గుర్తించిన హౌస్‌మేట్స్ సంతోషంతో గంతులేశారు.‌ మ‌రోవైపు ఆనందం ప‌ట్ట‌లేని అభిజిత్‌, నోయ‌ల్.. హారిక‌ను ఎత్తుకుని మ‌రీ లోప‌లికి తీసుకొచ్చారు. ఇంకోసారి సెల్ఫ్ నామినేష‌న్ అవ‌కూడ‌ద‌ని, ఇది హెచ్చ‌రిక మాత్ర‌మేన‌ని నాగ్.. ఇంటి స‌భ్యుల‌కు సూచించారు. ఇక‌ దేశంలోనే ఏ బిగ్‌బాస్ షోకు రానంత టీఆర్పీ ఈ సీజ‌న్ మొద‌టి వారానికి వ‌చ్చింద‌ని నాగ్‌ వెల్ల‌డించడంతో ఇంటి స‌భ్యులు ఎగిరి గంతేశారు. (బిగ్‌బాస్ మాయ గుట్టు విప్పిన వితికా)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు