అప్పులున్నాయి, ప్లీజ్ స‌పోర్ట్‌: అవినాష్ సింప‌థీ గేమ్‌?

7 Nov, 2020 23:26 IST|Sakshi

మోనాల్ కోసం ఒక్క‌డై పోరాడిన‌ అఖిల్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ప్రేక్ష‌కుల‌ ఓటింగ్ మీదే ఆధార‌ప‌డి ఉంద‌ని నాగార్జున మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. సోష‌ల్ మీడియాలో చెప్పేది న‌మ్మ‌కండ‌ని సూచిస్తూ షో ప్రారంభించారు. కెప్టెన్ అమ్మ రాజ‌శేఖ‌ర్ ఇంట్లో అంద‌రినీ శివాలెత్తిస్తార‌ని చెప్పుకొచ్చారు. హౌస్‌లో ఎవ‌రి మీదైనా ఫిర్యాదులున్నాయా అని ఇంటిస‌భ్యుల‌ను ఆరా తీశారు. అభిజిత్ మాస్ట‌ర్ తాము చెప్పేది వినిపించుకోవ‌డం లేద‌ని చెప్పాడు. కానీ నాగార్జున మాత్రం మాస్ట‌ర్ కెప్టెన్ అంటూ అత‌డినే వెనకేసుకురావ‌డం గ‌మ‌నార్హం. అలాగే టీ స్టాండు టాస్క్‌లో ద‌గ్గ‌ర ఆత్మ‌గౌర‌వం అంటూ ఆట‌ మ‌ధ్య‌లో నుంచి నిష్క్ర‌మించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు.

ఎవ‌రు వెలిగే దీపం, ఎవ‌రు ఆరిపోయే దీపం?

కంటెస్టెంటు వెలిగే దీపం ఆరిపోయే దీపం
అభిజిత్ మోనాల్ అమ్మ రాజ‌శేఖ‌ర్
అరియానా అవినాష్‌ అభిజిత్
మోనాల్ అఖిల్ అరియానా
సోహైల్ మెహ‌బూబ్ అరియానా
అవినాష్ అరియానా మోనాల్
హారిక లాస్య అవినాష్
లాస్య హారిక అరియానా
మెహ‌బూబ్ సోహైల్ అరియానా
అమ్మ రాజ‌శేఖ‌ర్ అరియానా అఖిల్
అఖిల్ మోనాల్ అమ్మ రాజ‌శేఖ‌ర్


మోనాల్‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకున్న అఖిల్‌
మోనాల్ ఒంట‌రిగా ఫీల‌వడాన్ని చూసి ఏమైంద‌ని నాగ్ ప్ర‌శ్నించారు. అఖిల్ నామినేట్ చేయ‌డం త‌ట్టుకోలేక‌పోయాన‌ని, త‌న‌తో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించా కానీ ప‌ట్టించుకోలేదని వాపోయింది.. ఈ హౌస్‌లో అత‌డు నా ఫ్యామిలీ మెంబ‌ర్ అనుకున్నా అంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. దీని గురించి అఖిల్ స్పందిస్తూ ఆమె స్ట్రాంగ్ అవ్వాల‌నే అలా చేశాన‌ని స‌మాధాన‌మిచ్చాడు. దీంతో నాగ్‌ ఆమె నీకు ఫ్రెండా? అంత క‌న్నా ఎక్కువా? అని సూటి ప్ర‌శ్న విసిరాడు. ఒక్క క్ష‌ణం ఆలోచ‌న‌లో ప‌డ్డ అఖిల్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇదే ప్ర‌శ్న‌ను మోనాల్‌ను అడ‌గ్గా ఆమె కూడా జ‌స్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. (చ‌ద‌వండి: నోయ‌ల్ అవుట్‌, మోక‌రిల్లి దండం పెట్టిన అవినాష్‌)

త‌న ముఖంలో చిరున‌వ్వులు వెలిగించే దీపం అఖిల్..
అయితే అఖిల్‌ను వెలిగే దీప‌మ‌ని మోనాల్ చెప్ప‌డంతో అత‌డు సంతోషం ప‌ట్ట‌లేక‌ ఆమెను హ‌త్తుకుంటూ ఇన్నాళ్ల ఎడ‌బాటుకు చెక్ పెట్టాడు. ఇక అరియానా డిక్టేట‌ర్ కెప్టెన్ అని చాలామంది ఇంటిస‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ ఆమె మాత్రం దాన్ని అంగీక‌రించ‌లేదు. ఆమె కెప్టెన్ అయిన‌ప్పుడు అంద‌రికీ స‌మానంగా ప‌నులు అప్ప‌గించ‌లేద‌ని మెహ‌బూబ్ చెప్పుకొచ్చాడు. ఎందుక‌ని ప్ర‌శ్నిస్తే నాకు కొంద‌రి కంఫ‌ర్ట్ కావాల‌ని స‌మాధాన‌మిచ్చింద‌ని అరియానాలోని మ‌రో కోణాన్ని వెల్ల‌డించాడు. ఇక మోనాల్‌ను నామినేట్ చేసినందుకు అఖిల్‌ను ఆరిపోయే దీప‌మ‌ని చెప్పాడు. అఖిల్ ఆమెకు ట్రూ ఫ్రెండ్ కాద‌న్నాడు. (చ‌ద‌వండి: ఏయ్ హారిక‌, నోర్మూయ్‌: చెల‌రేగిన మాస్ట‌ర్)

హారిక‌ను సేఫ్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌
నిజంగానే నాగ్ చెప్పిన‌ట్టు తొలిసారి బిగ్‌బాస్ షోలో అద్భుతం జ‌రిగింది. క‌మ‌ల్ హాస‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్ తెర‌మీద క‌నిపించారు. మ‌న కంటెస్టెంట్ల‌ను వారికి, అక్క‌డి వాళ్ల‌ను మ‌న‌వారికి ప‌రిచ‌యం చేశారు. మీ హౌస్ ఫుల్లుగా ఉందేంటి అన‌గా అది నాకు న‌చ్చ‌ని మాట అని క‌మ‌ల్ కౌంట‌రేశారు. అలా కాసేపు స‌ర‌దాగా సంభాషించి తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. అనంత‌రం క‌మ‌ల్ తెలుగు బిగ్‌బాస్‌కు వీడ్కోలు తీసుకునే ముందు హారిక‌ను సేఫ్ చేశారు. త‌ర్వాత నాగ్ మ‌రో ట్విస్టు ఇచ్చారు. టీ స్టాండు టాస్కులో చివ‌రి వ‌ర‌కు ఆడిన మోనాల్‌, అవినాష్‌లు త‌ర్వాతి వారం ఇమ్యూనిటీ పొందేందుకు మ‌రో అవ‌కాశాన్ని ఇచ్చారు. అందులో భాగంగా ఇద్ద‌రికీ చెరో బుట్ట ఇచ్చి అందులో ఇంటిస‌భ్యుల‌ను ఒప్పించి వారి వ‌స్తువుల‌ను త్యాగం చేయాల‌ని కోరాలి. ఎవ‌రి బుట్ట బ‌రువెక్కితే వారు ఇమ్యూనిటీ పొందుతారు. (చ‌ద‌వండి: హిమాలయాలకు వీడ్కోలు)

షో వ‌దులుకున్నా, అప్పులున్నాయి, స‌పోర్ట్ చేయండి.. 
దీంతో అవినాష్ మిగ‌తా మిగ‌తా కంటెస్టెంట్ల ద‌గ్గ‌ర బేర‌సారాలాడాడు. "నేను షోను వ‌దులుకుని వ‌చ్చాను. మ‌ళ్లీ తీసుకోమ‌న్నారు. ఇల్లు అప్పులు క్లియ‌ర్ చేసుకోవాలి. మా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి" అని త‌న బాధ‌ను ఏక‌రువు పెట్టాడు. మ‌రోవైపు మోనాల్ త‌న‌కు ఇమ్యూనిటీ అవ‌స‌ర‌మంటూ స‌పోర్ట్ చేయ‌మ‌ని కోరింది. ఇప్పుడు చేయ‌లేన‌ని లాస్య నిర్మొహ‌మాటంగా చెప్పింది. మిగ‌తావాళ్లు స‌పోర్ట్‌ చేయ‌లేమ‌ని నేరుగా చెప్ప‌కుండా చేతల్లో నిరూపించారు. మోనాల్‌కు స‌పోర్ట్ చేద్దామ‌నుకున్న సోహైల్‌ను మెహ‌బూబ్ వ‌ద్ద‌ని వారించాడంతో అవినాష్‌ కోసం త‌న వస్తువుల త్యాగానికి సిద్ధ‌ప‌డ్డాడు.

ఇమ్యూనిటీ పొందిన అవినాష్‌
హారిక‌కు మోనాల్‌కు స‌పోర్ట్ చేయాల‌ని ఉన్న‌ప్ప‌టికీ అవినాష్ త‌నకే చేయాల‌ని ప‌ట్టుప‌ట్టాడు. కానీ అత‌డు ప‌క్కు వెళ్ల‌గానే మోనాల్ బుట్ట‌లో త‌న వ‌స్తువుల‌ను వేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌గా అప్ప‌టికే బ‌జ‌ర్ మోగింది. దీంతో అఖిల్ ఒక్క‌డే మోనాల్‌కు స‌పోర్ట్ చేయ‌గా లాస్య‌, సోహైల్‌, మెహ‌బూబ్‌, అరియానా.. అవినాష్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో మోనాల్ బుట్ట‌ 13 కిలోలు, అవినాష్ బుట్ట 23 కిలోల బ‌రువు తూగ‌గా త‌ర్వాతి వారానికి గానూ అవినాష్‌కు ఇమ్యూనిటీ ల‌భించింద‌ని నాగ్ ప్ర‌క‌టించారు. ఇక‌ కెప్టెన్‌గా అంద‌రి మీదా అజ‌మాయిషీ చేస్తోన్న అమ్మ రాజ‌శేఖ‌ర్ రేప‌టి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన‌ట్లు స‌మాచారం. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: కెప్టెన్‌గా మాస్ట‌ర్‌, మ‌రి ఎలిమినేష‌న్‌?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు