మాట‌లు జాగ్ర‌త్త‌గా రానీ: మెహ‌బూబ్ వార్నింగ్‌

22 Sep, 2020 18:22 IST|Sakshi

ఫిజిక‌ల్ టాస్క్ అంటేనే ఎవ‌రి శ‌క్తి ఏంటో చూపించుకునే ఓ అవ‌కాశం. కానీ ఇదే టాస్క్‌లో వాదులాడుకోవ‌డాలు, కొట్టుకోవ‌డాలు, తోసుకోవడాలు ఇలా ఎన్నో జ‌రుగుతాయి. నేటి ఎపిసోడ్‌లో ఇచ్చిన ఫిజిక‌ల్ టాస్క్‌లో కూడా ఇదే జ‌ర‌గ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో మెహ‌బూబ్ త‌న స‌హ‌నాన్ని కోల్పోగా, అగ్గిపుల్ల‌లాంటి దేవి నాగ‌వ‌ల్లితో గొడ‌వ ప‌డ్డాడు. ఈ మేర‌కు స్టార్ మా తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో త‌న శ‌క్తినంతా కూడ‌దీసుకుని మెహ‌బూబ్ ప్ర‌త్య‌ర్థి టీమ్‌కు గ‌ట్టిపోటీనిస్తున్నాడు. అత‌డి స్పీడ్‌కు బ్రేక్ వేసేందుకు ప్ర‌త్య‌ర్థి టీమ్‌లోని దేవి నాగ‌వ‌ల్లి ప‌రుగెత్తుతున్న మెహ‌బూబ్‌ను కాల‌ర్ ప‌ట్టుకుని ఆపింది. (చ‌ద‌వండి: ట్రోలింగ్ చూసి చాలా బాధ‌ప‌డ్డా: వితికా షెరు)

దీంతో చిరాకు ప‌డ్డ మెహ‌బూబ్ త‌న చొక్కా ప‌ట్టుకోవ‌ద్ద‌ని సూచించాడు. అందుకు ఆమె అభ్యంత‌రం చెప్పింది. ఈ క్ర‌మంలో పెద్ద ర‌భ‌సే జ‌రగ్గా "మాట‌లు జాగ్ర‌త్త‌గా రావాలి" అని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇంటిస‌భ్యులు గొడ‌వ‌ను స‌ద్దుమ‌ణిగించే ప్ర‌య‌త్నం చేశారు. కంటెస్టెంట్లు ఒక‌రి మీద ఒక‌రు ప‌డ‌టం, మెడ ప‌ట్టుకుని గెంటేయ‌డం చూస్తుంటే రెండు టీమ్‌లు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అయితే ఈ బీభ‌త్స‌మంతా కేవ‌లం ప్రోమో వ‌ర‌కేనా, లేదా ఎపిసోడ్‌లోనూ ఉంటుందా? అని కొంద‌రు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మ‌రికొంద‌రేమో.. పోయి పోయి దేవితో పెట్టుకున్నావేంట్రా బాబూ అని మెహ‌బూబ్‌పై జాలి చూపిస్తున్నారు. (చ‌ద‌వండి: బీటౌన్‌లో 'బిగ్‌బాస్' సంద‌డి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు