-
మెహబూబ్ ఇంట షాదీ వేడుకలు.. ఫోటోలు వైరల్
మ్యూజిక్ వీడియోలు, డ్యాన్స్ స్టెప్పులతో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు మెహబూబ్ దిల్సే. టిక్‌టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఇతడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎప్పుడైతే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడో అప్పుడే అతడి దశ తిరిగిపోయింది. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. ఈ రెండూ అతడి సొంతమయ్యాయి. ఫలితంగా సొంతింటి కల సాకారం, తనకంటూ కొత్త కారు కొనుకున్నాడు. తాజాగా అతడి ఇంట పెళ్లి సంబరాలు జరిగాయి. మెహబూబ్ తమ్ముడు సుభాన్ షైఖ్ ఓ ఇంటివాడయ్యాడు. పెళ్లి డ్రెస్‌లో ఉన్న తమ్ముడితో పాటు, తండ్రితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు మెహబూబ్. 'నిఖా ముబారక్ మేరా భాయ్.. ప్రియమైన సోదరుడా.. నీ కలలు నిజం కావాలని, ఆ అల్లా మీ ఇద్దరినీ ఎల్లప్పుడూ కలిసి ఉంచాలని కోరుకుంటున్నాను. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరికొకరు తోడుగా ఉండండి. ఎప్పుడూ సహనం, ఓర్పుతో మెదలండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు నిఖా చేసుకున్న సుభాన్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమ్మ కూడా ఉండుంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది మెహబూబ్ తల్లి మరణించింది. View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) చదవండి: తప్పును అంగీకరిస్తున్నా.. దయచేసి క్షమించండి -
లగ్జరీ కారు కొన్న మెహబూబ్ దిల్సే, ఎన్ని లక్షలో తెలుసా?
గుంటూరు మిర్చి లాంటి కుర్రోడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే కొత్త కారు కొన్నాడు. ఈద్ పండగ సందర్భంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును ఇంటికి తెచ్చుకున్నాడు. దీని ధర రూ.15 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్ కలర్లో మెరిసిపోతున్న కారు ముందు దిగిన ఫోటోలను మెహబూబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది చూసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సోహైల్, శ్రీరామచంద్ర, కాజల్, అర్జున్ కల్యాణ్, రవికృష్ణ తదితరులు అతడికి శుభాకాంక్షలు చెప్తున్నారు. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి అన్నా అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. రంజాన్ మాసం కావడంతో తన స్నేహితులకు ఇఫ్తార్ పార్టీ కూడా ఇచ్చాడు మెహబూబ్. కాగా మెహబూబ్ టిక్‌టాక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయ్యాడు. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌తో అతడికి కావాల్సినంత గుర్తింపు లభించింది. బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే వేదికగా చిరంజీవి అందించిన పది లక్షల రూపాయలకు తోడు తను సంపాదించిన డబ్బులను జత చేసి గుంటూరులో సొంతిల్లు కట్టుకున్నాడు. నిత్యం యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో మెహబూబ్ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) చదవండి: సినిమా హిట్.. థియేటర్‌కు వెళ్లిన దర్శకుడికి షాక్.. -
శ్రీసత్యకు ప్రపోజ్ చేసిన మెహబూబ్, చేయి కోసుకుంటానంటూ బ్లాక్మెయిల్!
బిగ్‌బాస్ ఫేం శ్రీసత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ 6 సీజనల్లో హౌజ్‌లో అడుగుపెట్టి తనదైన ఆట తీరుతో బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె స్టార్ మా ప్రసారం అవుతున్న బిబి జోడి డాన్స్‌లో షోలో అలరిస్తోంది. ఇందులో శ్రీసత్య మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సేతో జోడికట్టింది. వీరిద్దరి జోడికి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టేజ్‌పై డాన్స్ చేస్తుండగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటూ షో జడ్జస్ కూడా వారి పర్ఫామెన్స్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: వాగ్వాదంగా మారిన అనసూయ వాలంటైన్స్ డే పోస్ట్, చెప్పుతో కొడతానంటూ..! ఇదిలా ఉంటే మంగళవారం వాలంటైన్స్ డే సందర్భంగా మెహబూబ్ దిల్ సే శ్రీసత్యకి ఎర్ర గులాబిల బోకెతో ప్రపోజ్ చేసి షాకిచ్చాడు. దీంతో శ్రీసత్య అతడిపై సీరియస్ అయిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొరియోగ్రఫర్స్ ప్రియాంక, సంకేత్ల సాయంతో మహబూబ్ దిల్ సే శ్రీసత్యకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. శ్రీసత్య దగ్గరికి వెళ్లి మొదట పరోక్షంగా ఓ అమ్మాయిని ప్రమించానని, తను రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనంటూ వాపోయాడు. ఎవరిని అంటూ ఆరా తీయగా.. నిన్నేనని ఆమెను సర్ప్రైజ్ చేశాడు. దీంతో శ్రీసత్య షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ హౌజ్‌లో పెంట అయ్యింది.. ఇప్పుడు కూడా పెంట అయ్యిద్ది? అంటూ మహబూబ్‌పై గట్టిగా అరిచింది. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ దీనికి అతడు ‘నువ్వు, నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చాయ్. నీలాంటి మంచి అమ్మాయిని వదుకోవాలనుకోవడం ఇష్టం లేదు’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. ఇక శ్రీసత్య తన ప్రపోజల్‌ను ఒప్పుకోకపోవడంతో చేయి కోసుకుంటానంటూ మహబూబ్ బ్లాక్మెయిల్ చేయడంతో.. ‘ఇప్పటికే నేను ఆత్మహత్యయత్నం కూడా చేశా తెలుసా? నా ఎంగేజ్మెంట్ బ్రేకప్ తర్వాత నా లైఫ్‌లో ఎవరికి మరో చాన్స్ ఇవ్వాలనుకోవడం లేదు. నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది’ అంటుంది శ్రీసత్య. అలా కాసేపు ఇద్దరు అర్గ్యూ చేసుకున్న అనంతరం ఇది ప్రాంక్ అంటూ అందరికి షాకిచ్చాడు మహబూబ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. -
గుంటూరులో ఇల్లు కట్టిన మెహబూబ్, ఫ్యామిలీతో గృహప్రవేశం
మెహబూబ్ దిల్సే.. నాట్ జస్ట్ ఏ యూట్యూబర్.. వెరీ టాలెంటెడ్ యాక్టర్, డ్యాన్సర్ కూడా! ఇల్లు కట్టుకోవాలన్న కల అందరిలాగే అతడికి కూడా ఉండేది. బిగ్‌బాస్ షో అతడి కలకు పునాదులు వేసింది. తన కష్టార్జితానికి తోడు కుటుంబమంతా తలా కొంత సాయం చేయడంతో సొంతింటి కలను నిజం చేసుకున్నాడు మెహబూబ్. తల్లిదండ్రులు, తమ్ముడు, తాను తలా కొంత కూడబెట్టుకున్న డబ్బుతో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నామని చెప్పుకొచ్చాడు. గుంటూరులో ఉన్న ఆ ఇల్లును చూపిస్తూ హోమ్ టూర్ వీడియో చేశాడు. ఈ ఇంటికి ఒకవైపు మూడు గదులు ఏర్పాటు చేయించి వాటిని దుకాణాల కోసం రెంట్‌కు ఇచ్చేలా నిర్మించారు. దీంతో గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న హాల్, కిచెన్, సింగిల్ బెడ్ రూమ్ మాత్రమే ఉన్నాయి. మొదటి అంతస్థులో కిచెన్, హాల్‌తో పాటు రెండు విశాలమైన డబుల్ బెడ్ రూమ్స్ ఉన్నాయి. మెహబూబ్ తన అభిరుచికి తగ్గట్టుగా కప్‌బోర్డ్స్, వాల్ పేపర్ అన్నీ దగ్గరుండి వేయించినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల పనులన్నీ చాలా లేట్‌గా అయ్యాయాన్న మెహబూబ్ ఫ్యామిలీ.. మొత్తంగా ఈ ఇల్లు కట్టడానికి 16 నెలలు పట్టిందని వెల్లడించింది. ఇంతకీ ఆ ఇల్లు ఎలా ఉందో మీరూ చూసేయండి.. -
టిక్‌టాక్ స్టార్‌కి ప్రపోజ్ చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
Bigg Boss 4 Fame Mehaboob Dil Se Proposed To Swetha Naidu: బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూట్యూబ్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన మెహబూబ్ గతేడాది బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. ఇటీవలె 'గుంటూరు మిర్చి' అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించాడు. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్‌సిరీస్‌లు చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా యూట్యూబర్, టిక్‌టాక్ స్టార్ శ్వేత నాయుడుకు ప్రపోజ్ చేశాడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి కవర్ సాంగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మెహబూబ్ ఎక్కువగా శ్వేత నాయుడుతోనే రీల్స్ అప్లోడ్ చేస్తుంటాడు. తాజాగా ఆమెకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు. 'ఎప్పటి నుంచో చెబ్దాం అనుకున్నా. కానీ ఎప్పుడు ఎలా అయ్యిందో తెలియదు. ఎందుకు ఇష్టం అన్నదానికి ఆన్సర్ తెలియదు. నువ్వు నా తోడుంటే బెటర్, సక్సెస్ఫుల్ పర్సన్‌ని అవుతా. నాతో జీవితాంతం తోడుంటావా' అంటూ తన మనసులో మాటను రివీల్ చేశాడు. దీంతో శ్వేత సైతం సిగ్గుపడుతూ మెహబూబ్ ప్రేమను అంగీకరించింది. దీనికి సంబంధించిన వీడియోను మెహబూబ్ తన సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. మరి ఈ ఇది రియల్ వీడియోనా లేక యూట్యూబ్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియోనా అన్నది తెలియాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వ్యక్తిపై అకారణంగా ఎస్ఐ దాడి
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం
సీఎం జగన్‌తోనే బడుగుల అభ్యున్నతి
ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్
No Headline
నా మంచితనాన్ని.. చేతగానితనంగా తీసుకోవద్దు
టీడీపీ ప్రచారంలో యానిమేటర్
బాల్యవివాహాలను నియంత్రించాలి
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement