Bigg Boss 6 Telugu Nominations: ఈ వారం నామినేషన్‌లో ఎవరెవరున్నారంటే?

28 Nov, 2022 15:55 IST|Sakshi

రాజ్‌ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఇనయ కెప్టెన్‌గా ఉండటంతో ఆమె నామినేషన్స్‌ నుంచి తప్పించుకుంది. ఇక నామినేషన్‌ ప్రక్రియకు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజైంది. ఫైమా మాట్లాడుతూ.. రేవంత్‌ తర్వాత నువ్వే స్ట్రాంగ్‌ అంటూ రోహిత్‌ను నామినేట్‌ చేసింది. నేను చెప్పేది వినకపోతే వెళ్లి సోఫాలో కూర్చో అంటూ రేవంత్‌ మీద ఫైరయ్యాడు ఆదిరెడ్డి. కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లో బిగ్‌బాస్‌ కనిష్ట ధర నీ నిర్ణయానికే వదిలేసినా నువ్వు చెక్‌ మీద లక్ష రూపాయలు రాయడం తప్పన్నాడు శ్రీహాన్‌.

అంతా అయిపోయాక ఎవ్వరైనా మాట్లాడతారని ఆదిరెడ్డి పెదవి విరవడంతో అది మినిమమ్‌ కామన్‌సెన్స్‌ అన్నా, నేనైతే రూపాయి కూడా రాసేవాడిని అని మండిపడ్డాడు శ్రీహాన్‌. సెన్స్‌ అంటే ఫీలైన నువ్వు కామన్‌సెన్స్‌ అని మాట్లాడుతున్నావు, అది ఎంతవరకు కరెక్టో నీకే తెలియాలి అని కౌంటరిచ్చాడు ఆది. ఇక ఈ వారం కెప్టెన్‌ ఇనయ, శ్రీహాన్‌ మినహా మిగతా ఆరుగురు నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: రాజ్‌ ఎలిమినేషన్‌కు కారణాలివే!
ఒక్కటైన ప్రేమ జంట, ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు