Bigg Boss Telugu 6: అర్జున్‌పై రేవంత్‌ పిడిగుద్దులు, ఆదిని కొట్టిన వాసంతి

20 Oct, 2022 23:44 IST|Sakshi

Bigg Boss 6 Telugu, Episode 47 Highlights: బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ ప్రస్తుతం ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. బిగ్‌బాస్‌ వార్నింగ్‌లు, టాస్కులతో ఎపిసోడ్స్‌లో కొంత ఫ్రెష్‌నెస్‌ కనిపిస్తోంది. కడుపు మాడితే ఎలా ఉంటుందో చూపించిన బిగ్‌బాస్‌ ఇప్పుడు హౌస్‌లో ఉండటానికి హౌస్‌మేట్స్‌ తమకు అర్హత ఉందని నిరూపించుకోవాలంటూ టాస్క్‌ ఇచ్చాడు. మరోవైపు శ్రీహాన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కూడా జరిగాయి. మరి ఆ విశేషాలేంటో నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌లో వివరంగా చదివేద్దాం..

ప్రతిరోజు ఏదైనా హుషారెత్తించే పాటతో నిద్రలేపే బిగ్‌బాస్‌ ఈరోజు మాత్రం కుక్క అరుపులు ప్లే చేసి కంటెస్టెంట్లు ఉలిక్కిపడేలా చేశాడు. కాసేపటికే హౌస్‌మేట్స్‌ ఆకలి అంటూ అలమటిస్తుండటంతో తిరిగి ఫుడ్‌ పంపించాడు బిగ్‌బాస్‌. కానీ దీనికంటే ముందుగా హౌస్‌మేట్స్‌ ఇకమీదట 100 శాతం ఎఫర్ట్స్‌ పెడతామని ప్రతిజ్ఞ చేశారు. మెరీనా అయితే టాస్క్‌ ఉన్నా లేకపోయినా ఈరోజు నుంచి కచ్చితంగా కంటెంట్‌ ఇస్తానని శపథం చేసింది. మౌనవ్రతం వీడిన బిగ్‌బాస్‌.. ఇంట్లో ఉండే అర్హత కోసం పోటీపడాలని సూచించాడు.

పిట్ట గోలకు ఫుల్‌స్టాప్‌ చెప్పి ఇనయ, శ్రీహాన్‌ కలిసిపోవడంతో వారిని మిగతా హౌస్‌మేట్స​ ఆటపట్టించారు. మమ్మల్నందరినీ వదిలేసి కేవలం ఇనయకు మాత్రమే బాగున్నావని ఎలా కాంప్లిమెంట్‌ ఇస్తావ్‌ అంటూ శ్రీహాన్‌ మీద మూకుమ్మడిగా దాడి చేసింది హౌస్‌లోని మహిళా లోకం. దీంతో ఇలా బుక్కైపోయానేంట్రా బాబూ అని తల గోక్కున్నాడతడు. తర్వాత శ్రీహాన్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేశారు. అందులో భాగంగా ఇనయ దగ్గరుండి కేక్‌ మీద చోటు అని రాయించి హార్ట్‌ సింబల్‌ వేయించింది. బర్త్‌డే బాయ్‌ కేక్‌ కట్‌ చేసి మొదట ఇనయకు తినిపించాడు. వీరి సడన్‌ ఫ్రెండ్‌షిప్‌ చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు.

అనంతరం బిగ్‌బాస్‌ బ్యాటిల్‌ ఫర్‌ సర్వైవర్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో నిన్నటి టీమ్సే కొనసాగుతాయన్నాడు. రేవంత్‌, ఫైమా, బాలాదిత్య, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, రాజ్‌, కీర్తి రెడ్‌ టీమ్‌ కాగా ఇనయ ఆ టీమ్‌ లీడర్‌గా వ్యవహరించింది. మిగిలినవారంతా బ్లూ టీమ్‌ కాగా దానికి శ్రీసత్య లీడర్‌గా కొనసాగింది. ఈ గేమ్‌లో శ్రీహాన్‌.. శ్రీసత్య చేతిలో నుంచి బొమ్మ లాక్కునే క్రమంలో ఆమె కింద పడింది. ఇక రేవంత్‌ ఏం చేసినా శ్రీసత్య పాయింట్‌ అవుట్‌ చేస్తూ రెచ్చగొట్టడంతో అతడు సహనం కోల్పోయి ఫైర్‌ అయ్యాడు. అలా వీరిద్దరూ టాస్క్‌లో ఒకరినొకరు విమర్శించుకోవడమే పనిగా పెట్టుకున్నారు.

దొరికిందే ఛాన్స్‌ అనుకున్న అర్జున్‌.. నిన్ను వెక్కిరించినందుకు అతడిని నామినేట్‌ చేయ్‌ అని శ్రీసత్యకు సలహా ఇచ్చాడు. అయితే శ్రీసత్య మాత్రం.. అతడిని నామినేట్‌ చేసినా బయటకు వెళ్లడు, టాప్‌ 5 కంటెస్టెంట్‌, ఫిక్స్‌ అయిపోవాల్సిందే అని అని చెప్పింది. ఈ గేమ్‌ రెండో లెవల్‌లో కంటెస్టెంట్లు ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లారు. కాళ్లు అడ్డం పెట్టాడని అర్జున్‌ను రేవంత్‌, నెట్టేశాడని ఆదిరెడ్డిని వాసంతి కొట్టారు. హింస ఉండకూడదు అని సత్య నెత్తీనోరు మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు.

చదవండి: దమ్ముంటే అడ్డుకో, ఎత్తిపడేసిన శ్రీహాన్‌

మరిన్ని వార్తలు