Bigg Boss 6: టాస్క్‌ని నిర్లక్ష్యం చేస్తారా.. బయటకు వెళ్లండి..గేట్లు ఎత్తేసిన బిగ్‌బాస్‌

19 Oct, 2022 09:11 IST|Sakshi

బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో ప్రతివారం కెప్టెన్సీ కంటెండర్‌ కోసం బిగ్‌బాస్‌ టాస్కులు ఇస్తారన్న విషయం తెలిసిందే. ఆ టాస్క్‌ని విజయవంగా పూర్తి చేసినవారు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. తర్వాత వారికి మరోటాస్క్‌ ఇచ్చి..గెలిచిన వారిని ఆ వారం కెప్టెన్‌గా ప్రకటిస్తారు. అయితే సీజన్‌-6లో కెప్టెన్సీ కంటెడర్‌ టాస్కులు అంతగా పేలడం లేదు. కంటెస్టెంట్స్‌ అతిగా ఆలోచించి.. వాళ్లకు వాళ్లే కొత్త రూల్స్‌ పెట్టుకుంటున్నారు. ఫలితంగా బిగ్‌బాస్‌ ఆశించిన ఔట్‌పుట్‌ రావడంతో లేదు. కనీసం ఈ వారం అయినా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిద్దామని భావించిన బిగ్‌బాస్‌కు.. చేదు అనుభవమే మిగిలింది. ఎప్పటిమాదిరే ఇంటి సభ్యులు ఆటను పక్కకి పెట్టి ముచ్చట్లలో మునిగారు. దీంతో బిగ్‌బాస్‌ వారిపై ఫైర్‌ అయ్యాడు.. అంతేకాదు ఇష్టంలేని వాళ్లు ఇంటి నుంచి వెళ్లొచ్చని గేటు ఓపెన్‌ చేశాడు. 

ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌గా ‘సెలెబ్రెటీ గేమింగ్‌ లీగ్‌’టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులను రెండు భాగాలుగా విడదీశాడు. ఇరు టీమ్‌లోని సభ్యులు.. బిగ్‌బాస్‌ ఇచ్చే కొన్ని హిట్‌ సినిమాలలోని ప్రముఖ పాత్రలను పోషించాలి. దీంతో పాటు సమయానుసారం బిగ్‌బాస్‌ ఇచ్చే చాలెంజెస్‌లో ఇరు టీమ్‌లు పోటీ పడాల్సి ఉంటుంది. టాస్క్‌ ముగిసే సమయానికి  ఏ టీమ్‌ ఎక్కువ చాలెంజెస్‌ గెలుస్తారు వారు విజేతలుగా నిలుస్తారు.  

టీమ్‌లు.. వారి పోషించిచే పాత్రలు
టాలీవుడ్‌ ఫాంటసిస్‌
రేవంత్‌- ‘ఘరానా మొగుడు’లో రాజా(చిరంజీవి)
బాలాదిత్య- భీమ్లానాయక్‌లో భీమ్‌(పవన్‌కల్యాణ్‌)
శ్రీహాన్‌-చెన్నకేశరెడ్డిలో చెన్నకేశవ(బాలకృష్ణ)
ఆదిరెడ్డి-కూలీ నెం.1లో రాజు(వెంకటేశ్‌)
కీర్తి- ఒసేయ్‌ రాములమ్మలో రాములమ్మ(విజయశాంతి)
ఫైమా- నరసింహాలో నీలాంబరి(రమ్యకృష్ణ)
ఇనయా-జగదేకవీరుడు అతిలోక సుందరీలో ఇంద్రజ(శ్రీదేవి)

టాలీవుడ్‌ డైనమిక్‌
అర్జున్‌-టెంపర్‌లో దయా(ఎన్టీఆర్‌)
సూర్య-పుష్పలో పుష్పరాజ్‌(అల్లు అర్జున్‌)
రోహిత్‌-మగధీరలో కాళభైరవ(రామ్‌ చరణ్‌)
రాజ్‌-ఛత్రపతిలో శివ(ప్రభాస్‌)
శ్రీసత్య-ఫిదాలో భానుమతి(సాయిపల్లవి)
గీతూ-పుష్పలో శ్రీవల్లీ(రష్మిక)
మెరీనా- అరుంధతి(అనుష్క)
వాసంతి- బొమ్మరిల్లులో హాసిని(జెనిలియా)

ఇక వారి వారి పాత్రలకు సంబంధించిన  కాస్ట్యూమ్స్‌ ధరించిన కంటెస్టెంట్స్‌.. బిగ్‌బాస్‌ ఆశించిన స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించలేదు. పాత్రలను పట్టించుకోకుండా.. కూర్చొని ముచ్చట్లు పెట్టారు. ఇక ఆదిరెడ్డి అయితే బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్కులే వేస్ట్‌ అన్నట్లు మాట్లాడాడు. గేమ్‌ చప్పగా సాగడంతో బిగ్‌బాస్‌ అందరిని గార్జెన్‌ ఏరియాలోకి పిలిచి గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. 

ఇప్పటి వరకూ బిగ్‌బాస్‌ చరిత్రలో ఏ టాస్క్‌ కూడా ఇంత నిరాశజనకంగా జరగలేదు. ఇదొక్కటే కాదు ఈ సీజన్‌లో ఏ టాస్క్‌ అయినా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అందుకు కారణం ఇంటి సభ్యుల నిర్లక్ష్యం. టాస్కుల పట్ల శ్రద్ధలేదు. బిగ్‌బాస్‌ ఆదేశాలు, ఇంటి నియమాలను పట్టించుకోవడం లేదు. మీ నిర్లక్ష్యం బిగ్‌బాస్‌నే కాకుండా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ టాస్క్‌లో పాత్రల్లో ఉండాలన్న కనీస నియమాన్ని కూడా మర్చిపోయారు. ఫైమా, సూర్య, గీతూ, రేవంత్‌, శ్రీహాన్‌, రాజ్‌లతో పాటు కీర్తి, ఆదిత్య కూడా కొంతవరకు తమ పాత్రల్లో ఉండేందుకు ప్రయత్నించారు. మిగిలిన సభ్యులంతా స్వేచ్ఛగా,తమకు నచ్చిన విధంగా ఉన్నారు.

బిగ్‌బాస్‌ చరిత్రలో ఎన్నడులేని విధంగా టాస్కులను నిరాశపరుస్తున్న కారణంగా ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ని రద్దు చేస్తున్నానని బిగ్‌బాస్‌ ప్రకటించారు. దీంతో కంటెస్టెంట్స్‌ అంతా షాకయ్యారు. క్షమాపణలు చెబుతూ.. ఆటను కొనసాగించాలని కోరారు.అయితే బిగ్‌బాస్‌ మాత్రం ఈ వారం టాస్క్‌లేదని, ఇంటికి కెప్టెన్‌ కూడా ఉండడని చెప్పి, సభ్యులు ధరించిన కాస్ట్యూమ్స్‌ని స్టోర్‌ రూమ్‌లో పెట్టించాడు. అంతేకాదు.. బిగ్‌బాస్‌ పట్ల, టాస్క్‌లు పట్ల గౌరవం లేకుంటే..తక్షణమే వెళ్లిపోవచ్చని గేటుని ఓపెన్‌ చేశాడు. 

అయితే హౌస్‌మేట్స్‌ మాత్రం బిగ్‌బాస్‌ తిట్టింది నన్ను కాదంటే నన్ను కాదు అనేవిధంగా ప్రవర్తించాడు. శ్రీహాన్‌ అయితే కెమెరా దగ్గరకు వెళ్లి ‘టైంకి తినాలి.. సోది ముచ్చట్లు పెట్టుకోవాలి.. ముందు వాళ్లకి బిగ్ బాస్ షో గురించి చెప్పండి బిగ్ బాస్.. మినిమమ్ క్లారిటీ లేదు.. ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుల వల్ల అందరికీ ఎఫెక్ట్ అవుతుంది’ అన్నాడు. బిగ్‌బాస్‌ టాస్క్‌ రద్దు చేశాడు. ఇప్పుడు హౌస్‌మేట్స్‌ ఏం చేస్తారు. గేమ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లారో చూడాలి.

మరిన్ని వార్తలు