Bigg Boss 7 Day 92 Highlights: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే.. ఆ ఒక్క కంటెస్టెంట్ తప్ప!

4 Dec, 2023 23:40 IST|Sakshi

బిగ్‌బాస్ చిట్టచివరి నామినేషన్స్ అయిపోయాయి. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండాల్సిన ఈ ప్రక్రియ.. చాలా సిల్లీగా నడిచింది. ఎప్పటిలానే పనికిమాలిన సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్ ఒకరిపై ఒకరు పగ ప్రతీకారాలు చూపించుకున్నారు. వీటన్నింటిలో అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం కాస్తోకూస్తో ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. ఇంతకీ సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 92 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

నామినేషన్స్ హడావుడి
గౌతమ్ ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక నామినేషన్స్‌తో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. 'టికెట్ టూ ఫినాలే' రేసులో గెలిచిన ఫైనలిస్ట్ అయిన కారణంగా అర్జున్.. ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్లు చెప్పారు. అలా ఈ ప్రక్రియ షురూ అయింది. 

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?

  • యావర్ - శోభా, ప్రియాంక
  • శోభాశెట్టి - యావర్, శివాజీ
  • ప్రశాంత్ - అమర్,శోభాశెట్టి
  • అర్జున్ - అమర్, యావర్
  • ప్రియాంక - అమర్, యావర్
  • శివాజీ - ప్రియాంక,  అమర్
  • అమర్ - ప్రశాంత్, యావర్

చాలా అతి చేసిన యావర్ 
వీకెండ్ ఎపిసోడ్‌లో ఓ సందర్భంలో ప్రియాంక మాట్లాడుతూ యావర్.. ఇంట్లో తక్కువ పనిచేస్తున్నాడని చెప్పింది. ఇప్పుడు అదే పాయింట్‌ కారణాన్ని చూపించి ప్రియాంకని యావర్ నామినేట్ చేశాడు. అయితే ప్రియాంక గురించి మాట్లాడినప్పుడు ఆమెతోనే మాట్లాడాలి. కానీ శోభా-అమర్ పేర్లు ప్రస్తావించాడు. ఫేవరిజం చూపిస్తున్నావ్ నువ్వు అని ప్రియాంకతో అన్నాడు. మధ్యలో ఎంటరైన శోభా.. నీత నన్ను కంపేర్ చేయకు, అసలు నువ్వేం చేస్తావ్.. డిన్నర్ రెడీ అయిన తర్వాత వస్తావ్, తింటావ్, వెళ్లిపోతావ్.. అంతకు మించి ఏం చేస్తున్నావ్ అని యావర్ అసలు చేసేదాన్ని బయటపెట్టింది. దీంతో యావర్‌ పిచ్చిపిచ్చిగా ప్రవరిస్తూ అతి చేశాడు.

అమర్‌కి షాకిచ్చిన ప్రియాంక
సీరియల్ బ్యాచ్‌కి చెందిన ప్రియాంక.. తన ఫ్రెండ్ అయిన అమర్‌నే నామినేట్ చేసింది. గతవారం టికెట్ టూ ఫినాలే పోటీలో భాగంగా గేమ్ ఓడిపోయిన బాధలో ఉంటే, పదే పదే పాయింట్స్ గురించి తనని అడగడం నచ్చలేదని కారణం చెప్పింది. ఇక మిగిలిన వాళ్లవి ఓకే అనిపించేలా నామినేషన్స్ జరిగాయి. అమర్-ప్రశాంత్ మధ్యలో మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. రెండో వారం నామినేషన్స్‌ని గుర్తుచేశారు.

అమర్ vs ప్రశాంత్
గత కొన్ని వారాల నుంచి బాగానే ఉన్న ప్రశాంత్, అమర్.. ఈసారి నామినేషన్స్‌లో రెచ్చిపోయారు. అమర్.. ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య నువ్వు ఫేక్ అంటే నువ్వు ఫేక్ అంటూ, మోసం చేస్తున్నావ్ అదీ ఇది అని అనుకున‍్నారు. మీదమీదకు వెళ్లి మరీ కొట్టుకుంటారా అనేలా ప్రవర్తించారు. చివరకు శివాజీ, మిగతా ఇంటి సభ్యులు కల్పించుకోవడంతో సైలైంట్ అయిపోయారు. 

ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ 
ఈ ఫినాలే రేసు మిమ్మల్ని ఓ ఫైనలిస్టుని చేస్తుంది లేదా ఫినిష్ లైన్ చేరకుండానే ఆపేస్తుంది. ఆ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. వారు మీ ప్రతి ఆట ప్రతి మాట ప్రతి కదలిక చాలా దగ్గర నుంచి గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటినుంచి మీరు చేసే ప్రతి పని మీ గెలుపోటములని నిర్ణయిస్తుంది. బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రెండు వారాలు కూడా మీ ఓటింగ్ లైన్స్ తెరుచుకుంటాయి. ఎక్కువ ఓట్లు పొందిన వాడు.. బిగ్‌బాస్ 7 విజేతగా నిలుస్తాడు. కానీ ఒకవేళ ఈ వారం మీ ఓట్లు.. మిగతా వారి కంటే తక్కువగా ఉంటే ఫినాలే వారానికి చేరుకోవడానికి ముందే ఎలిమినేట్ అవుతారు. అర్జున్.. ఫినాలే వీక్‌కి చేరుకున్నాడు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యాడని బిగ్‌బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. 

>
మరిన్ని వార్తలు