ఏకధాటిగా 21 గంటలు షూటింగ్‌లో పాల్గొన్నా

1 Mar, 2021 15:23 IST|Sakshi

మోనాల్‌ గజ్జర్‌ ఇప్పుడీ పేరు టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపి‍స్తోంది. బిగ్‌బాస్‌ షోతో ఈ అమ్మడుకు దక్కిన క్రేజ్‌‌ వేరే ఎవరికీ దక్కలేదు. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా హౌజ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ భారీగానే పారితోషికం అందుకున్నట్లు టాక్‌ వినిపించింది. ఒక వైపు తన ముద్దుముద్దు మాటలు.. మరో వైపు హౌస్‌లో ట్రయాంగిల్‌ లవ్‌స్టోరి షోకే హైలేట్‌గా నిలిచాయి. కొన్నిసార్లు ఆమె ప్రవర్తనకు విమర్శలు ఎదురైనా అవేం పట్టించుకోకుండా తనదైన శైలిలో ముందుకు వెళ్ళిపోయింది. పద్నాలుగా వారాలపాటు హౌస్‌లోఉన్న ఈ గుజరాతి భామ ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ భామ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. కుర్రకారుల మనస్సును కొల్లగొట్టిన ఈ బ్యూటీ ఓంకార్‌ డ్యాన్స్‌ ప్లస్‌ షోలో జడ్జిగా చేస్తోంది. అఖిల్‌ సార్థక్‌తో ఓ వెబ్‌ సిరీస్ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. కాగా, ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తను చేసిన పోస్ట్‌ ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. డ్యాన్స్ ‌షో ఎపిసోడ్‌ కోసం ఏకంగా 21 గంటలు షూటింగ్‌ చేసినట్లు వెల్లడించింది. అంతసేపు కష్టపడినా ఇప్పటికీ ఎంత ఫ్రెష్‌గా ఉన్నానో అంటూ ఓ వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో యాడ్‌ చేసింది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్‌ మోనాల్‌ ఓపిక, సహనానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

చదవండి: 

మోనాల్‌ గిఫ్ట్‌: హాట్‌గా ఉన్నానంటున్న అఖిల్‌!

మహేశ్‌బాబుతో మోనాల్‌ స్పెషల్‌ సాంగ్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు