Bigg Boss OTT Telugu: బిగ్‌బాస్‌ ఓటీటీ కంటెస్టెంట్ల ఫైనల్‌ లిస్ట్‌ ఇదే!

16 Feb, 2022 18:04 IST|Sakshi

బుల్లితెరపై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఇప్పుడు ఓటీటీ వేదికగా వినోదం పంచేందుకు సిద్ధమైంది. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో 'డిస్నీ+ హాట్‌స్టార్‌'లో ప్రసారం కానున్న ఈ షోకు సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈనెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌ అంటూ ప్రోమోను సైతం రిలీజ్‌ చేశారు.

తెలుగులో తొలిసారి 24గంటల పాటు ప్రసారం కానున్న ఈ షో రెగ్యులర్‌ బిగ్‌బాస్‌కి ఏమాత్రం తగ్గకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు మేకర్స్‌ రెడీ అయ్యారు. ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే సీజన్‌-1నుంచి సీజన్‌-5 వరకు కనీసం ఇద్దరేసి కంటెస్టెంట్లను తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు సోషల్‌మీడియా, యూట్యూబ్‌ నుంచి కొందరు పాపులర్‌ వ్యక్తులను రంగంలోకి దించుతున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ ఓటీటీకి సెలక్ట్‌ అయిన కంటెస్టెంట్ల లిస్ట్‌  సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. మరి వాళ్లు ఎవరో చూసేయండి..

1. ముమైత్‌ ఖాన్‌(సీజన్‌-1)
2. ధనరాజ్‌(సీజన్‌-1)
3. ఆదర్శ్‌( సీజన్‌-1)
4. తనీష్‌(సీజన్‌-2)
5. అషు రెడ్డి( సీజన్‌-3)
6.మహేష్‌ విట్టా(సీజన్‌-3)
7. అరియానా(సీజన్‌-4)
8.అఖిల్‌ సార్థక్‌(సీజన్‌-4)
9. సరయూ( సీజన్‌-5)
10. హమీదా( సీజన్‌-5)
11.నటరాజ్‌ మాస్టర్‌ (సీజన్‌-5)

కొత్త కంటెస్టెంట్లు వీరే..
12.యూట్యూబర్‌ నిఖిల్‌
13.యాంకర్‌ శివ
14.యాంకర్‌ స్రవంతి
15. ఆర్జే చైతు
16. మిస్టర్‌ ఇండియా 2021 మోడల్‌ అనిల్‌ రాథోడ్‌
17.బమ్‌ చిక్‌ బబ్లూ
18. కప్పు ముఖ్యం బిగులూ ఫేం సన్నీ ఫ్రెండ్‌
19. నటి, మోడల్‌ మిత్రా శర్మ

వీరిలో ఒకరిద్దరు మినహా దాదాపు అందరూ ఫైనల్‌ అయినట్లేనని తెలుస్తుంది. 

మరిన్ని వార్తలు