బిగ్‌బాస్‌: అవినాష్‌ను ఎత్తి ప‌డేసిన అరియానా

11 Oct, 2020 17:47 IST|Sakshi

ఈ వారం ప్రారంభంలో బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌కు బీబీ హోట‌ల్ టాస్క్ ఇచ్చిన విష‌యం తెలిసిందే క‌దా! అందులో స్టాప్‌గా ప‌నిచేసే వారిపై అతిథులు జులుం ప్ర‌ద‌ర్శించారు. చిత్ర‌విచిత్ర టాస్కులు ఇస్తూ టిప్పు కేవ‌లం టిప్పు ఇవ్వడానికే మూడు చెరువుల నీళ్లు తాగించారు. అతిథులు చెప్పిన‌దానిక‌ల్లా త‌లాడిస్తూ, చెప్పిన ప్ర‌తిదాన్ని చిటికెలో చేసినా చివరాఖ‌రకు ఒక్క స్టార్ మాత్ర‌మే సంపాదించ‌గ‌లిగారు. కానీ ఈ టాస్క్‌లో అతిథుల ఓవ‌ర్ యాక్ష‌న్ మాత్రం మామూలుగా లేదు. వీరి అతికి భ‌య‌ప‌డి సుజాత ఏడ్చేసింది కూడా. ఇదంతా ఓ కంట గ‌మ‌నిస్తూ ఉన్న నాగార్జున నేడు హోట‌ల్ సిబ్బంది టీమ్‌కు, అతిథులపై ప్ర‌తీకారం తీర్చుకునే అవ‌కాశ‌మిచ్చారు. (చ‌ద‌వండి: ఇక్కడ రిలేష‌న్స్ పెట్టుకోవ‌డం వేస్ట్‌: అఖిల్‌)

దీంతో క‌సి మీద ఉన్న‌ మాస్ట‌ర్‌.. హారిక‌ను త‌ల‌పై నీళ్ల గ్లాసు పెట్టుకోమ‌ని చెప్ప‌‌గా ఆమె ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. త‌ర్వాత సోహైల్‌ను కోతిలా గెంత‌మ‌ని ఆదేశించిన‌ట్లు క‌నిపిస్తోంది. 'అవినాష్‌ నా చేయి పట్టుకున్నాడు', 'న‌న్ను ముద్దు పెట్టుకోబోయాడు' అంటూ గోల గోల చేసిన అరియానాకు పెద్ద క‌ష్ట‌మైన టాస్క్ ఏమీ ఇవ్వ‌లేదు. అవినాష్‌ను ఎత్తుకుని తిప్ప‌మ‌ని చెప్ప‌గా దాన్ని కూడా ఆమె త‌న‌కు అనుకూలంగా మార్చేసుకుంది. అత‌డిని ఎత్తుకున్న‌ట్లే చేసి అమాంతం కింద‌ప‌డేసింది. త‌ర్వాత‌ మెహ‌బూబ్.. సుజాత‌ను ఎత్తుకుని ఎక్స‌ర్‌సైజ్ చేశాడు. అలా ప్ర‌తీకారం తీర్చుకునేందుకు నాగ్ క‌ల్పించిన అవ‌కాశాన్ని ఇంటి స‌భ్యులు విచ్చ‌ల‌విడిగా ఉప‌యోగించుకున్నార‌ని స్రోమో చూస్తేనే స్ప‌ష్ట‌మ‌వుతోంది. (చ‌ద‌వండి: 'పుచ్చ ప‌గిలిపోద్ది' డైలాగ్‌పై నాగ్ సీరియ‌స్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు