Bimbisara Box Office Collection: బాక్సాఫీస్‌పై ‘బింబిసారుడి’ దాడి.. కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే తొలిసారి..

6 Aug, 2022 12:06 IST|Sakshi

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టు గుడ్ క్యాప్ష‌న్.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ట్‌ దర్శకత్వం వహించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్‌ 05) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది.

(చదవండి:  'బింబిసార' మూవీ రివ్యూ)

దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.30 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.27 కోట్ల షేర్‌ కలెక్షన్లను రాబట్టింది

(చదవండి: బాక్సాఫీస్‌ కళ​ కళ.. సంతోషంలో స్టార్‌ హీరోలు..ట్వీట్స్‌ వైరల్‌)

కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో  ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. కల్యాణ్‌ రామ్‌ గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ గమనిస్తే..  ఎంత మంచివాడవురా రూ.2.20 కోట్లు, 118 రూ.1.60 కోట్లు, నా నువ్వే రూ.0.75 కోట్లు, ఎంఎల్‌ఏ రూ. 2.72 కోట్లు, ఇజం 3.09 కోట్ల షేర్స్ అందుకున్నాయి.

రూ.40 కోట్ల బడ్జెట్‌తో బింబిసార చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజే హిట్‌ టాక్‌ రావడంతో బ్రేక్‌ ఈవెన్‌ ఈజీగా దాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

‘బింబిసార’ తొలి రోజు కలెక్షన్స్‌..

► నైజాం - రూ.2.15 కోట్లు

► సీడెడ్ - రూ.1.29 కోట్లు

► ఈస్ట్ - రూ.43 లక్షలు

► వెస్ట్ -  రూ.36 లక్షలు

► ఉత్త‌రాంధ్ర - రూ.90 లక్షలు

► గుంటూరు- రూ.54 లక్షలు

► కృష్ణా - రూ. 34 లక్షలు

► నెల్లూరు - రూ.26 క్షలు

► కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా- రూ.0.32 లక్షలు

► ఓవర్సీస్‌ రూ.65లక్షలు

► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 7.27 కోట్ల షేర్‌ (రూ.11.50 కోట్ల గ్రాస్‌)

మరిన్ని వార్తలు