టాలీవుడ్‌లో సూపర్‌ హిట్ మూవీ హీరోయిన్.. ఈ నటిని గుర్తు పట్టగలరా..!

13 Jan, 2023 19:15 IST|Sakshi

సినీ పరిశ్రమలో ఎందరో తారలు కనుమరుగై పోవడం మనం చూస్తుంటాం. అలాగే ప్రతి ఏటా కొత్తగా పదుల సంఖ్యలో ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే టాలీవుడ్‌లో సూపర్ హిట్‌ అందుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడేం చేస్తోందో తెలుసా? ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ హీరోయిన్‌ కథేంటో చదివేద్దాం. 

నేహా పెండ్సే.. ఈ పేరు చాలామందికి తెలియదు. టాలీవుడ్‌లో సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ముంబయి భామ. ఆమెకిదే తెలుగులో మొదటి సినిమా. ఆ తర్వాత 2003లో వచ్చిన గోల్‌మాల్‌, 2008లో వచ్చిన వీధిరౌడీ సినిమాలోనూ కనిపించింది. కానీ సినిమాలతో ఆమె పెద్దగా సక్సెస్ కాలేదు.  ఆ తర్వాత పలు హిందీ, మరాఠీ, తమిళ, మలయాళంలోనూ నటించింది. ఆమె 2018లో బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా కనిపించింది.  

కాగా.. మొదట 1995 నుంచి సీరియల్స్‌లో నటిస్తోంది. ప్రస్తుతం కూడా హిందీలో పలు సీరియళ్లలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ‘బాబీజీ ఘర్ పర్ హై’ అనే హిందీ సీరియల్ చేస్తోంది.  అనితా విభూతి నారాయణ్ మిశ్రా పాత్ర పోషించినందుకు  ఫేమ్ సాధించింది. ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది భామ. ఇప్పుడున్న నేహాను చూస్తే తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోవచ్చు.. కానీ ముంబై బ్యూటీ టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేసుంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. 


 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు